గ్రౌండ్ రియాలిటిస్

నేను మార్చి,12 2007న “గుండెచప్పుడు” అనే బ్లాగులో “భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా!” అనే టపాకి నాస్పందన తెలియజేస్తు ఈ క్రిందివ్యాఖ్యను వ్రాసాను. చిత్రమైన మరియు బాధకరమైన విషయమేమిటంటే నేటికి ఈవిషయం అలానేవుంది.

“స్వయం పాలనాధికారం రాగానే, మీరు చెప్పిన ప్రస్తుత తెలంగాణ సమస్యలైనా “నీళ్లు, నిధులు,ఉద్యోగాలు ,స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం …” వంటి సమస్యల పరిష్కారాలు ఎలా సాధ్యపడతయో నాకు అర్ధం కావట్లేదు. ఉదాహరణకి: ‘నీళ్ళు ‘ తీసుకుందాము. ఈ జాతీయ జలమండళలు,బచావత్ వంటి వాటర్ ట్రిబ్యునళ్ళ తీర్పుల కట్టుబాట్లు, సరిహద్దు రాష్ట్రాల జలవివాదాలు, ఇవన్ని ఏ రాష్టానికైన రావణకాష్టంవంటి సమస్యలే; ఇక నిధులు: ఇవి ఎక్కడనుంచి వస్తాయీ. కేంద్రం ప్రత్యేకాభిమానంతో నిధులు సమకూర్చదు కదా. అంతర్గత పన్నుల ద్వార కొన్ని నిధులు సమకూర్చుకోవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్తితులలో తెలంగాణ ప్రజలు విటిని ఎల తట్టుకోగలరు? లేదా మరోక మార్గం, అప్పు తెచ్చుకోవటం. కొత్త రాష్ట్రానికి ఏ విదేశి సంస్త అప్పులివ్వటానికి ముందుకోస్తుంది? ఒకవేళ ఇచ్చినా, వారి హిరణ్యాక్షవరాలు కొత్త రాష్ట్రం తిర్చగలదా? ఇక ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్రామేర్పడిన తరువాత కొత్తగా వచ్చే ఉద్యోగాలేమిటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు. అవి ప్రస్తుత నిరుద్యోగ సమస్యని తీర్చగలవా? కేవలం స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం అన్ని సమస్యలు తీర్చలేవు. ఇదంతా చదివి నేనేదో ఒక వర్గనికి కొమ్ముకాస్తున్నను అని భావించవద్దు. నేనూ తెలంగాణ వాసినే. కాకపోతే, నా బాధల్లా, ఎప్పుడు తెలంగాణ విషయం చర్చకొచ్చినా, వాదోపవాదాలు, విసుర్లు, అంతిమంగా ఫలనావారు ఈ గ్రూపు కి చెందినవారని వర్గీకరణలు. వీటితొ సాదించేదేమిటొ నాకు అర్ధంకావటంలేదు. ఫ్రెండ్స్, ఇకనైనా గ్రౌండ్ రియాలిటిస్ గురించి మాట్లాడదాము.”

7 వ్యాఖ్యలు (+add yours?)

  1. Bhai
    డిసెం 25, 2009 @ 01:41:47

    Basu nuvve entha realty chepena gani “apara gandhi ” ki e vishayalu ardam avavuvu ga

  2. krishna
    డిసెం 25, 2009 @ 03:47:58

    బాబ్రి మసీదు కూల్చి రామ మందిరం కడితె యె సమస్యలు పరిష్కారం అయ్యాయి? ఇదీ అంతె. నూవు యెంత అహంకారివి కాకపొతె మా తెలంగాణ ఆత్మ గౌరవానికి విలువలేదు అని వాదిస్తావ్?
    నువ్వు యెంత లాజికల్గా మట్లాడినా వినె దద్దమ్మలు ఇక్కడ యెవరు లేరు. యె సమస్యలు పరిష్కారం అవుతైయొ నీకు చెప్పినా అర్థం కాదులె.
    53 యెళ్ళగా యెంత దగాపడినామొ నీకు తెలియదు. తెలంగాణ ఇవ్వకుంటె రక్తపాతమె!!? జనం చచ్చుడొ తెలంగాణ వచుడొ!!

    తెలంగాణాని దొచుకుంది అక్కడి బుస్వాములు దొరలె అంధ్రావాళ్ళు కాదు. ఇన మేము హైదరాబాదుని యెంత డెవెలొప్ చేసాము. ఇపుడు వెళ్ళామంటె అన్యాయమె. మమలని దొచుకునారు. నువ్వు చెపినత్తు యె సమస్యా పరిష్కారం అవ్వవు అంటె విని చావరె. తెలంగాణ ఇస్తె రక్తపాతమె!!? జనం చచ్చుడొ కలిసి వుండుడొ!!!

    హహహహ

    సమాదానం అర్థంకాలెదా? నెనెవరొ గురుతు పట్టలెదా?

    నా పేరు…………. రాజకియ్యం.

    నాకు సహస్ర నాలుకలు, వెయి మొహాలు, అనేక రంగులు. ఈ సమస్యలు వాటి పరిష్కారాలు అనీ నాయందె ఇమిడి వునాయి. వెల కెసీఅర్ లు వెల చంద్రబాబులు వెల వెల సొనియాలు నయందె దర్సనం ఇచ్చుచున్నారు. సమస్యలకు తగిన సమయంలొ తగిన పరిష్కారం నెను చెస్తానుగా!! నీవు నిమ్మితమాత్రురాలవు!!!
    అట్లానె వుండు. అనవసర విష్యాలలొ తల దూర్చి బుర్ర పాడుచెసుకొకు!!!

  3. Valluri Sudhakar
    డిసెం 25, 2009 @ 04:49:23

    ఏం చేస్తాం చెప్పండి. కాలం, ఖర్మం కలిసివచ్చే మంచిరోజుకై ఎదురుచూడటము తప్ప.

  4. budugoy
    డిసెం 25, 2009 @ 07:39:09

    పెళ్ళి చేసుకుంటే, పిల్లల్ని కంటే ఖర్చులు రెండురెట్లవుతాయి. పాలపీకలనుండి డైపర్లవరకు ఎక్కడలేని చాకిరీ అని ఎవరైనా మానేస్తున్నారా? మనదంటూ మనకుండడం సార్వభౌమాధికారం అనేవి చాలా ముఖ్యం. ఇది మైక్రో లెవెల్ ఉదాహరణ. మీరడిగే ప్రశ్న మాక్రో లెవెల్లో అంతే తేడా. అలాగయితే బ్రిటిష్ వాళ్ళను మనమెప్పటికైనా పంపేవాళ్ళమా? మరో మాట చెప్పండి.

  5. సుజాత
    డిసెం 25, 2009 @ 13:41:02

    ఆయనే ఉంటే మంగలెందుకనీ..సామెత! ఇవన్నీ ఆలోచించగలిగితే రాష్ట్రాన్ని ఈ స్థితికెందుకు తెస్తారు?

    చెవుల్లో దూది పెట్టుకుని మెదడు తలుపులు మూసేసుక్కూచున్న వాళ్ళకు ఇవన్నీ వినపడవు. ఒక నది మీద వంతెన మధ్యలో గోడ పెట్టారంటే, ఇక రాష్ట్రం విడిపోతే నదీ జలాల విషయంలో ఎంతెంత యుద్ధాలు(ఇప్పుడు కర్నాటకతో చేస్తున్నవి చాలక) వస్తాయో ఊహించండి.

    ఇక్కడ తాత్కాలికావేశాలకే గానీ గ్రౌండ్ రియాలిటీస్ ఎవరికీ అక్కర్లేదు. ఈ విషయంలో మేథావులైనా భావోద్వేగాలకు అతీతులు కాదు.

  6. Sreyobhilashi
    డిసెం 25, 2009 @ 17:00:51

    ఇప్పుడే ఈ కామెంటు మరోచోట రాసాను.

    సందిట్లో సడే మియా!
    కాంగ్రెస్సు రాజకీయ నిరుద్యోగుల(అటు సీమంధ్ర, ఇటు తెలంగాణా లో) పరిస్థితి – రాజ శేఖరుడికి భయపడి dash మూసుకొని కూర్చున్నారు. ఉన్నట్టుండి తెలంగాణా మీద ప్రేమ కురిపిస్తున్నారు.
    అమాయక విద్యార్ధులు , అర్ధం కాని మేధావులు వేర్రోల్ల లాగా కేకలేస్తున్నారు, సమిధలవుతున్నారు.
    discovery ఛానల్ లో చూపించినట్లు – ఒక జింకను చిరుత పులి వేటాడి తరువాత సింహాలకి, పులులకి, హైనాలకి అర్పణ చేస్తుంది.

  7. Vinay
    డిసెం 26, 2009 @ 01:09:10

    తెలంగాణా ఇచ్హినా స్వాతంత్రం వచ్హింది అని పండుగలు చెస్కొవటం తప్పితే తర్వాత ఏంటి అని అలొచించేది ఎవరు?…

    నివురు కప్పిన నిప్పులా సబ్ ప్రైం క్రైసిస్ మన మీద పడపోతుంది అని అలొచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ??

    ఆర్ధికనిపుణులు ఇప్పటికే దీని గురించి హెచ్హరించారు..అయినా ఈ పోరాటాల్లో ఎవరికి ఇది వినపడలేదు..మన దురద్రుష్టం యే మీడియా కూడా దీని గురించి ఒక్క బులెటిన్ ప్రసారం చేసినా పాపం పోలేదు…

    మన పాలకులకి అసలు ఈ క్రైసిస్ గురించిన ఙ్నానం
    కూడాలేదు..

    -ఒక తెలంగాణా పౌరుడు

వ్యాఖ్యానించండి