గ్రౌండ్ రియాలిటిస్-2

నాటపాను సందర్శించి, గంభీరమైనవిషయం మీద వ్యాఖ్యాలువారందరికి నాకృతజ్ఞతలు.

బుడుగు గారు!
ఇది సామ్రాజ్యవాదానికి, సార్వభౌమాధికారానికి సంబందించినంత పెద్దవిషయం కాదు అనేది నాఅభిప్రాయం. ఈ పెద్దపదాలు దేశాలకి సంబందించినవి. ఇక్కడ జరుగుతున్నది, కేవలం ఒక రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలుచేయలనే అరాచకీయకుట్రమాత్రమే. ఈ పరమనీచరాజకీయ పరమపదసోపానపటంలో నిచ్చెనలెక్కేవారు రాజకీయనాయకులు, పాములుచేత కరవపడేవారు సామాన్యులు (ప్రస్తుతం విద్యార్ధులు + ఉద్యోగులు).

సుజాతగారు!
సామాన్యులుకానివారే మేధావులు నాఅభిప్రాయం. జనబాహుళ్యములోని సామాన్యులను, సమకాలీనులకు దిశానిర్దేశముచేసి వారికి సరైనమార్గానుసరణ చేయగలిగినవారిని మత్రమే మేధావులు అని గౌరవించాలితప్ప, భావోద్వేగాలపేరిట తమ మాటకారితనంతో, తెంపరితనంతో సామన్యులధనప్రాణాలతో రాజకీయచదరంగం ఆడేవారుకాదు.

శ్రేయోభిలాషిగారు!
బాగాగుర్తించారు. ప్రస్తుతం జరుగున్నది మనరాష్త్రంలో జరుగుతున్నది ఆటావీకన్యాయమే.

ప్రకటనలు

గ్రౌండ్ రియాలిటిస్

నేను మార్చి,12 2007న “గుండెచప్పుడు” అనే బ్లాగులో “భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా!” అనే టపాకి నాస్పందన తెలియజేస్తు ఈ క్రిందివ్యాఖ్యను వ్రాసాను. చిత్రమైన మరియు బాధకరమైన విషయమేమిటంటే నేటికి ఈవిషయం అలానేవుంది.

“స్వయం పాలనాధికారం రాగానే, మీరు చెప్పిన ప్రస్తుత తెలంగాణ సమస్యలైనా “నీళ్లు, నిధులు,ఉద్యోగాలు ,స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం …” వంటి సమస్యల పరిష్కారాలు ఎలా సాధ్యపడతయో నాకు అర్ధం కావట్లేదు. ఉదాహరణకి: ‘నీళ్ళు ‘ తీసుకుందాము. ఈ జాతీయ జలమండళలు,బచావత్ వంటి వాటర్ ట్రిబ్యునళ్ళ తీర్పుల కట్టుబాట్లు, సరిహద్దు రాష్ట్రాల జలవివాదాలు, ఇవన్ని ఏ రాష్టానికైన రావణకాష్టంవంటి సమస్యలే; ఇక నిధులు: ఇవి ఎక్కడనుంచి వస్తాయీ. కేంద్రం ప్రత్యేకాభిమానంతో నిధులు సమకూర్చదు కదా. అంతర్గత పన్నుల ద్వార కొన్ని నిధులు సమకూర్చుకోవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్తితులలో తెలంగాణ ప్రజలు విటిని ఎల తట్టుకోగలరు? లేదా మరోక మార్గం, అప్పు తెచ్చుకోవటం. కొత్త రాష్ట్రానికి ఏ విదేశి సంస్త అప్పులివ్వటానికి ముందుకోస్తుంది? ఒకవేళ ఇచ్చినా, వారి హిరణ్యాక్షవరాలు కొత్త రాష్ట్రం తిర్చగలదా? ఇక ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్రామేర్పడిన తరువాత కొత్తగా వచ్చే ఉద్యోగాలేమిటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు. అవి ప్రస్తుత నిరుద్యోగ సమస్యని తీర్చగలవా? కేవలం స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం అన్ని సమస్యలు తీర్చలేవు. ఇదంతా చదివి నేనేదో ఒక వర్గనికి కొమ్ముకాస్తున్నను అని భావించవద్దు. నేనూ తెలంగాణ వాసినే. కాకపోతే, నా బాధల్లా, ఎప్పుడు తెలంగాణ విషయం చర్చకొచ్చినా, వాదోపవాదాలు, విసుర్లు, అంతిమంగా ఫలనావారు ఈ గ్రూపు కి చెందినవారని వర్గీకరణలు. వీటితొ సాదించేదేమిటొ నాకు అర్ధంకావటంలేదు. ఫ్రెండ్స్, ఇకనైనా గ్రౌండ్ రియాలిటిస్ గురించి మాట్లాడదాము.”

Check out [No Title]

Hi,

I want you to take a look at: http://teluguthesis.com, where The Telugu books,magazines and useful sites’ links are available.I think you’l like it.

There is a great  Toolbar created by Teluguthesis team is very useful to you where you can find-

 Telugu news papers,English news papers,Business news,above 100 Telugu novels,Free mobile stuff,SMS….. many things in your mouse click distance.You can down load & install at..

http://wwwteluguthesiscom.ourtoolbar.com/

Please use theire “tela friend botton” to tell about this to your friends also.

Thank you.

“చేయెత్తి జైకొట్టు తెలుగోడా!”

సచీదేవి గారి వ్యాఖ్యలో “వెలికి తీద్దాం ఓకనాటి ప్రాభవం; తెలుగువారమని గర్వంగా చాటుదాం” అన్నవాక్యం స్పుర్తితో, నాటి పరిస్థితులకి, నేటి సమకాలీన రాజకీయలకి దర్పణం పట్టిన ‘వేములపల్లి శ్రీకృష్ణ’ గారి రచన 

“చేయెత్తి జైకొట్టు తెలుగోడా!” ఇక్కడుంచుతున్నాను. ముఖ్యంగా చివరి రెండు పద్యాలు గమనించండి,  ప్రస్థుతం ప్రభలుతున్న ప్రాంతీయవాదనికి అచ్చుగుద్దినట్లు సరిపొతున్నాయి.

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

గతమెంతో ఘనకీర్తి గలవోడా!

సాటిలేని జాతి – ఓట మెరుగని కోట

నివురుగప్పి నేడు – నిదురపోతుండాది

జైకొట్టి మెల్కోలుపు తెలుగోడా!

గతమెంతో ఘనకీర్తి గలవోడా!               || చేయెత్తి || 

వీర రక్తపుధార – వారబోసిన సీమ

పలనాడు నీదెరా – వెలనాడు నీదెరా

బాలచంద్రుడు చూడ ఎవడోయి!

తాండ్ర పాపయ్య గూడ నీవొడూ!            || చేయెత్తి || 

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల

మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే

వీరవనెతలగన్న తల్లేరా!

ధీరమాతల జన్మభూమేరా!                   || చేయెత్తి || 

నాగర్జునుడికొండ, అమరావతీ స్థూపం

భావాల పుట్టాలో – జీవకళ పొదిగావు

అల్పుడను కావంచు తెల్పావు నీవు!

శిల్పినని చాటావు దేశదేశాలలో!             || చేయెత్తి || 

దేశమంటే మట్టి కాదన్నాడు

మునుషులన్న మాట మరువబోకన్నాడు

అమర కవి గురజాడ నీవాడురా!

ప్రజల కవితను చాటి చూపాడురా!           || చేయెత్తి || 

రాయలేలిన సీమ – రతనాల సీమరా

దాయగట్టె పరులు – దారి తీస్తుండారు

నోరెత్తి యడగరా దానోడా!

వారసుడ నీవెరా తెలుగోడా!                    || చేయెత్తి || 

కల్లోల గౌతమీ – వెల్లువల కృష్ణమ్మ

తుంగభద్రా తల్లి – పోంగిపొరలిన చాలు

ధాన్యరాసులే పండు దేశానా!

కూడు గుడ్డకు కొదవలేదన్నా!                 || చేయెత్తి || 

ముక్కోటి బలగమోయ్ – ఒక్కటై మనముంటే

ఇరుగు పొరుగులోన – వూరు పేరుంటాది

తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!

సవతి బిడ్డల పోరు మనకేలా!                  || చేయెత్తి || 

పెనుగాలి వీచింది – అణగారి పోయింది

నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది

చుక్కాని బట్టారా తెలుగోడా!

నావ దరిజేర్చరా – మొనగాడా!               || చేయెత్తి || 

నవ్వుకుందాము

ఇద్దరు స్నేహుతుల సంభాషణ:

 “ఎన్నడు లేనిది నువ్వు కర్మ సిద్దాంతాన్ని నమ్ముతున్నవేమిటి?”
“అనుభావపుర్వకముగా తెలుసుకున్నాక నమ్మక తప్పటం లేదు”
“ఏమిటానుభావం?”
“ఇంకేమిటి – పెళ్లి”


డాక్టర్-రోగి సంభాషణ:

“చెప్పండి? ఏమిటి మీ సమస్య?”

“ఏం లేదు! నా భవిష్యత్తు గురించి ఒకటే బెంగ”

“మరేంపర్లేదు! నా దగ్గర మంచి ట్రీట్`మేంట్ వుంది. ఓ సంవత్సరంపాటు తీసుకుంటే చాలు. ఇక నా ఫీజు నెలకి వెయ్యి రుపాయలు చొప్పున అవుతుంది.”

“మీ భవిష్యత్తు సరే! నా భవిష్యత్తు సంగతి ఏమిటని?”


ఆఫిసరు-లేడి కర్క్ మద్య సంభాషణ:”ఆఫిసులో నవలలు చదవటానికా నీకు జీతం ఇస్తున్నది?””లేదు సార్! ఇది నేను ఫ్రీ గా చదువుతున్నాను”.


మాతృ ఠ??షా దినోత్సవ శుఠ??కాంక్షలు

మాతృభాషాప్రియులందరికీ నా శుభాభినందనలు.

ఓ సలహా!

ఉదయం లేచినప్పటినుండి తిరిగి నిద్రకుపకరించే వరకు ప్రతివక్కరము ఏదో ఒక రకమైన ఒత్తడిని ఎదుర్కొంటునేవుంటాం.  ఆఫీసులో పని ఒత్తడి, ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఆర్ధకపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు, ఇలా ఎన్నో ఒత్తడిలు ఎదుర్కొనేవారికి చివరికి ఇంటిలో కూడా మనఃశ్సాంతి కరువైతే అంతకన్నా దుర్భర జీవితం మరొకటి వుండదు. అందుకే బయట ఎదుర్కొంటున్న సమస్యలను ఇంటికి మోసుకురాకూడదు.   కాని అది పాటించేవారు తక్కువ.  ఆఫీసులో ఏర్పడిన ఘర్షణ, కోపాలను ఇంటి దగ్గర భార్య మీద ప్రదర్శిస్తారు కొందరు.  మరికొంతమంది తమలో తాము కోపతపాలను అనుచుకొని, బాధను దిగమింగుతు మదనపడిపోతుంటారు. ఇవి రెండూ   కుటుంబవాతావరణాన్ని పాడుచేసేవే. కనుక ఆఫీసు విషయాలను అక్కడే వదిలివేసి, ‘ఇంటి’ విషయాలు, ‘ఇంతి’ విషయాలు వంటబట్టించుకొంటే, సంసార సమతుల్యత కాపాడినవారవుతారు. ఏమంటారు?

Previous Older Entries