కీర్తిశేషులు పిఠాపురం నాగేశ్వరరావు గారు

తెలుగు సిని జగత్తులో జంట దర్శకులని, జంట సంగీత దర్శకులని చాలా మందిని చూసాంకాని, జంట గాయకులన తగ్గవారు మాత్రము శ్రీ మాధవపెద్ది శ్రీ పిఠాపురం మాత్రమే.   శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు: విశ్వనాధం అప్పయమ్మ గార్లు. అసలు వీరి ఇంటిపేరు పాతర్లగడ్డ ‘,  కానీ, చిత్తురు నాగయ్యగారిలాగా, నాగేశ్వరరావుగారు కూడా తమ ఊరిపేరునే తన ఇంటిపేరు చేసుకున్నారు.  పిఠాపురంలోని హైస్కూల్ చదువులువరకు చదువుకున్న నాగేశ్వరరావుకి రంగస్థలం మమకారం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన తండ్రి , ఆ రోజులలో మంచి రంగస్థల నటుడు. గాత్రశుద్ది బాగావున్న నాగేశ్వరరావు, స్నేహితుల ప్రోద్బలముతో, 1944 నుంచి వవ్యకళా సమితి వారి నాటకాల్లో నటించటము మొదలుపెట్టారు.  విశేషమేమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు.  ఆ అనుభవంతో, సినిమాలలో పాడాలనే ఆశతో, ఇంట్లో చెప్పకుండా మదరసు పారిపొయివచ్చారు. తెలిసినవారందరిళ్ళలో తలదాచుకోని తన అదృష్టన్ని పరిక్షించుకున్నారు. 1946 లో విడుదలైన మంగళసూత్రం అనే సినిమాలొ తొలిసారిగా పాడి, సినిరంగంలొ కాలుమోపారు. అప్పటికాయన వయస్సు కేవలం పదహరేళ్ళే . జెమినివారి ప్రతిష్టాత్మక సినిమా చంద్రలేఖ లొ పాడే అవకాశం రావటంతో సినిపరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అప్పటినుంచి, సుమారు పాతికేళ్ళు అనేక సినిమాల్లో పాడి తనసత్తా నిరుపించుకున్నారు.  అది సోలో అయినా, యుగళగీతమైనా సరే, ఆయన పాడినవన్ని దాదాపు హస్యగీతాలే. ఘంటసాల వారితో కలిసిపాడిన “మా ఊళ్ళో ఒక పడుచుంది” (అవేకళ్ళు) పాట, మాధవపెద్దిగారితో కలిసిపాడిన “ అయ్యయో! జేబులోడబ్బులుపొయనే ” (కులగోత్రాలు) పాట, పిఠాపురం గారికి ఎనలేని పేరుతెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరినోళ్ళలో నానుతాయంటే అతిశయొక్తికాదు.  ఆయన తెలుగులోనెగాక, తమిళ, కన్నడ, హింది, సింహళ భాషలలో సుమారు 7వేల పాటలు పాడారు. ఆయన చివరిసారిగా “చల్లని రామయ్య చక్కని సీతమ్మ” అనే పాట 1978లో బొమ్మరిల్లు సినిమాకోసం పాడారు. 1996 మార్చి 5న మృతి చెందిన హస్యగీతాల గోపురం శ్రీ పిఠపురం గారి కిదే శ్రద్దాంజలి. 

 శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన కోన్ని ఆణిముత్యాలు కింద లంకె లో వినగలరు.Music Listing – Music India OnLine 

 

5 వ్యాఖ్యలు (+add yours?)

  1. cbrao
    మార్చి 04, 2007 @ 16:40:00

    Nice article about the singer.

  2. gsnaveen
    మార్చి 05, 2007 @ 08:27:28

    అయ్యా..ఈ వ్యాసాల్ని మేము తెవికీ (http://te.wikipedia.org) లో ఉపయోగించుకోవచ్చునా?
    – నవీన్ గార్ల

  3. రానారె
    మార్చి 06, 2007 @ 14:29:09

    మరపురాని గాయకునికి అరుదైన నివాళి. బాగుంది. అభినందనలు.

  4. valluri
    మార్చి 06, 2007 @ 23:06:13

    నవీన్ గారు. నేను ఈ వ్యాసాన్ని తె.వీకి.. లో కూడా వుంచాను. తప్పక చూడగలరు.

    రావు గారు & రానారే గారు: కృతజ్ఞతలు. మీరు నాబ్లాగును దర్శించటం నాకు మహదానందం.

  5. రాకేశ్ ఆ.
    ఏప్రి 13, 2007 @ 01:09:58

    మా అమ్మకు చాలా ఇష్టం నాగాశ్వరరావుగారు. ఎప్పుడో వాళ్ళ ఊళ్ళో live ప్రదర్శన ఇచ్చారంట. MIO లింకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

వ్యాఖ్యానించండి