కె.విశ్వనాథ్

“కళాతపస్వి” పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గారి కి జన్మదిన శుభాకాంక్షలు.

viswanath_small.jpg

అత్భుతమైన సినికళఖండాలు  సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన విశిష్ట వ్యక్తి, కె.విశ్వనాథ్.   శ్రీ విశ్వనాథ్ గారు 1930 సంవత్సరము,ఫిబ్రవరి 19 న లో విజయవాడ లో జన్మించారు. మదరసు లోని ఒక స్టూడియోలో టెక్నీషియనుగా సినిమా జీవితప్రస్తానాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు హిరో నటించిన ఆత్మ గౌరవంవిశ్వనాథ్ గారికి దర్శకుడిగా మొదటి సినిమా. సిరిసిరిమువ్వ సినిమా ఆయన లోని ప్రతిభను  వెలుగులోకి తెచ్చింది. విశ్వనాథ్ గారి చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం‘. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగుసినిమాకే కళాసంస్కారం నేర్పింది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు శ్రీ విశ్వనాథ్ గారు. భారతీయ సాంప్రదాయ కళలకు పెద్దపిట వేస్తూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వరాభిషేకం మొదలైన అణిముత్యాలున్నవి. సాంప్రదాయ కళలూ, సమాజిక స్పౄహ వంటి విభిన్నాంశాలతో సవ్యసాచిలా చిత్రాలు నిర్మించారు. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాల తో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు నిర్మించారు. అనేక ప్రభుత్వ అవార్డులతోబాటు, ప్రజా రివార్డులని కూడా పొందిన విశ్వనాథ్ గారికి భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.  ఆయన ‘శంకరాభరణం’ కు జాతీయ పురస్కారం తో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది.   

వ్యాఖ్యానించండి