గ్రౌండ్ రియాలిటిస్

నేను మార్చి,12 2007న “గుండెచప్పుడు” అనే బ్లాగులో “భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా!” అనే టపాకి నాస్పందన తెలియజేస్తు ఈ క్రిందివ్యాఖ్యను వ్రాసాను. చిత్రమైన మరియు బాధకరమైన విషయమేమిటంటే నేటికి ఈవిషయం అలానేవుంది.

“స్వయం పాలనాధికారం రాగానే, మీరు చెప్పిన ప్రస్తుత తెలంగాణ సమస్యలైనా “నీళ్లు, నిధులు,ఉద్యోగాలు ,స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం …” వంటి సమస్యల పరిష్కారాలు ఎలా సాధ్యపడతయో నాకు అర్ధం కావట్లేదు. ఉదాహరణకి: ‘నీళ్ళు ‘ తీసుకుందాము. ఈ జాతీయ జలమండళలు,బచావత్ వంటి వాటర్ ట్రిబ్యునళ్ళ తీర్పుల కట్టుబాట్లు, సరిహద్దు రాష్ట్రాల జలవివాదాలు, ఇవన్ని ఏ రాష్టానికైన రావణకాష్టంవంటి సమస్యలే; ఇక నిధులు: ఇవి ఎక్కడనుంచి వస్తాయీ. కేంద్రం ప్రత్యేకాభిమానంతో నిధులు సమకూర్చదు కదా. అంతర్గత పన్నుల ద్వార కొన్ని నిధులు సమకూర్చుకోవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్తితులలో తెలంగాణ ప్రజలు విటిని ఎల తట్టుకోగలరు? లేదా మరోక మార్గం, అప్పు తెచ్చుకోవటం. కొత్త రాష్ట్రానికి ఏ విదేశి సంస్త అప్పులివ్వటానికి ముందుకోస్తుంది? ఒకవేళ ఇచ్చినా, వారి హిరణ్యాక్షవరాలు కొత్త రాష్ట్రం తిర్చగలదా? ఇక ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్రామేర్పడిన తరువాత కొత్తగా వచ్చే ఉద్యోగాలేమిటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు. అవి ప్రస్తుత నిరుద్యోగ సమస్యని తీర్చగలవా? కేవలం స్వయం నిర్ణయాధికారం, ఆత్మగౌరవం అన్ని సమస్యలు తీర్చలేవు. ఇదంతా చదివి నేనేదో ఒక వర్గనికి కొమ్ముకాస్తున్నను అని భావించవద్దు. నేనూ తెలంగాణ వాసినే. కాకపోతే, నా బాధల్లా, ఎప్పుడు తెలంగాణ విషయం చర్చకొచ్చినా, వాదోపవాదాలు, విసుర్లు, అంతిమంగా ఫలనావారు ఈ గ్రూపు కి చెందినవారని వర్గీకరణలు. వీటితొ సాదించేదేమిటొ నాకు అర్ధంకావటంలేదు. ఫ్రెండ్స్, ఇకనైనా గ్రౌండ్ రియాలిటిస్ గురించి మాట్లాడదాము.”

ప్రకటనలు