ప్రార్ధన

ప్రతి గాలివానకు … ఒక ఇంద్ర ధనుస్సు
ప్రతి కన్నీటికి … ఒక చిరునవ్వు
ప్రతి ఆలోచనకు … ఒక వాగ్దానం
ప్రతి కష్టానికి … ఒక ఫలితం
ప్రతి సమస్యకు … ఒక పరిష్కారం
ప్రతి నిట్టుర్పుకు … ఒక మధురగానం
ప్రతి ప్రార్ధనకు … ఒక దీవెన
ఆ భగవంతుడు అందరికి ప్రసాదించు గాక.

 — ఇది ఒక ఇరిష్ ప్రార్ధన ఆట, నాకు బాగా నచింది, అందుకే బ్లాగులో ఉంచుతున్నాను.

ప్రకటనలు

జున్ 4ఆరుద్రవర్దంతి సంధర్భంగా, ఆ మహానుభావుని స్మరించుకుందాం. 
 ఆరుద్ర

 ఆరుద్రఅభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు అయిన ఆరుద్రపూర్తిపేరు భాగవతుల శివశంకర శాస్త్రి.   సినీ గీత రచన కాక ఎంతో వైవిధ్యంగల గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య వ్యాసాలు, అనేక పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఏకకాలంలో వ్రాసి మెప్పించన సాహితి ధృవతార ఆరుద్ర. కూనలమ్మ పదాలు, త్వమేవాహం , సినీవాలి, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలు,  దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు,  శ్రీకృష్ణదేవరాయ , కాటమరాజు కథ వంటి కధా రూపకాలు తో పాటు కొన్ని నవలలనూ, మరికోన్ని కథలనూ కూడా రచించాడు. వేమన వేదం, మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు.సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఆరుద్ర విస్తూత రచన పటిమకు  పరాకాష్ట.    ఆరుద్ర వ్రాసిన కూనలమ్మ పదాలు, ఆయనలోని సాహిత్యఅభినివేశాన్ని, భాషపై పట్టుని పట్టి చూపిస్తాయి. నాకు నచ్చిన కొన్ని

ఆరుద్ర కూనలమ్మ పదాలు

సర్వజనులకు శాంతి

స్వస్తి, సంపద, శ్రాంతి

 నే కోరు విక్రాంతి

ఓ కూనలమ్మ

 

ఈ పదమ్ముల క్లుప్తి

ఇచ్చింది సంత్రుప్తి

 చేయనిమ్ము సమాప్తి

 ఓ కూనలమ్మ

 

సామ్యవాద పథమ్ము

సౌమ్యమైన విధమ్ము

 సకల సౌఖ్యప్రదమ్ము

ఓ కూనలమ్మ   

మధువు మైకము నిచ్చు

వధువు లాహిరి తెచ్చు

పదవి కైపే హెచ్చు

ఓ కూనలమ్మ్ 

కోర్టుకెక్కిన వాడు

కొండనెక్కిన వాడు

వడివడిగ దిగిరాడు

ఓ కూనలమ్మ

 

పాత సీసాలందు

నూతనత్వపు మందు

నింపితే ఏమందు?

ఓ కూనలమ్మ

 

తగిన సమయము చూచి

 తాను వేయును పేచి

 పాలిటిక్సుల బూచి

ఓ కూనలమ్మ

   

సరదాగా

నాకు ఓ మిత్రుడు పంపిన ఈ సరదా ఇ-మెయల్, సరదాగా నా బ్లాగులొ వుంచుతున్నాను. చిత్తగించండి.

  
25 years ago……

         A program was … a television show
         An application was .. for employment
         Windows were….. something u hated to clean
         A cusorused profanity
         A keyboard was …a piano
         Memory was….. something u lost with age
         A CD was… a bank account
         If u unzipped in public u went to jail
         Compress was something u did to garbage
         A hard drive was a long trip on the road
         Log on was adding wood to fire
         A backup happened to your toilet
         A mouse pad was where a mouse lived
         Cut.. u did with scissors
         paste.. u did with glue
         A web was a spiders home
         And a virus was the flu!!

… Times surely have changed

పొలీసు భార్య రాత్రి నిద్రలోంచి లేచి భర్తను లేపింది: “ఏమండోయ్ లేవండి, దొంగ వచ్చాడు పట్టుకోండి” 

పొలీసు భర్త: ” అబ్బా! విసిగించక పడుకోవే బాబు ! డ్యూటిలో లేనప్పుడు కూడా పనేమిటి?”

_____________________________________________________________________ 

పట్నం మకాంమార్చిన పరంధామయ్య భర్యతో: “నేను ఎప్పుడు దుబారా ఖర్చు పెడతానని  నా మీద ఊరికే అరుస్తావు కాని, నేనెప్పుడైనా అనవసరంగా ఒక్క వస్తువైనా కోన్నానా?” 

ఆ అమాయకపు ఇల్లాలు: “చాల్లేండి. ఆ నిప్పులార్పే సిలిండరు కొని చాలకాలమైంది. ఒక్క సారైనా వాడిన పాపానపొయ్యారా? అది దుబారా కాకా మరేంటి?” _______________________________________________________________________ 

చదువురాని నౌకరు యజమాని దగ్గరకు ఉత్తరం తెచ్చి “మావూరి నుంచి మా ఆడది ఈ ఉత్తరముక్క రాయించింది బాబు, కాసంత సదివి పెడతరా?” అని అడిగాడు. సరేనని, యజమాని ఉత్తరం అందుకొని చదవటం మొదలుపెట్టాడు.  అంతలో,  నౌకరు వెనుకనుంచి వచ్చి అతని చెవులు మూసివెయటంతో తెల్లబోయి విషయమేమిటని అడిగాడు. దానికా నౌకరు “మొగుడుపెళ్ళాల విషయంకదా బాబయ్య, పరాయోళ్ళు వింటే బావోదని” సంజయిషి ఇచ్చుకున్నాడు.

____________________________________________________________________

నేను పెళ్ళి చేసుకుంటే ఎంతమంది అబ్బాయిలు బాధాపదతారో తెలుసా?” అంది తానెంతో అందగత్తేనని ఫిలయ్యే సౌందర్య.  మరి అంతమందిని చేసుకోవటానికి మీ అమ్మానాన్నాలు ఒప్పుకుంటారా?” చప్పున అడిగింది ఐశ్వర్య.

_______________________________________________________________________ 

 సార్ ! మేనెజర్ గారు మిమ్మలని రమ్మ న్నారు”  చెప్పాడు అటేండర్, మందుబాబు మాణిక్యంతో.  ఆ! అంతమాటన్నరా? నేను ఆయన్ని బ్రాంది అన్నానని చెప్పు పో  అన్నాడు మాణిక్యం మత్తులో జోగుతు.   _____________________________________________________________________  

చాలసేపటి తరువాత వచ్చిన సిటిబస్ లొనికి తొసుకుంటు వెళ్ళి, వెంబటే తిరిగి దిగిన ఆసామిని చూచి విషయమేమిటని ఆశ్చ్యర్యంతో అడిగాడు దారినపోయె దానయ్య. దానికి ఆ ఆసామి  “మొన్న ఒకరోజున టికెట్ లేకుండా బస్సేక్కానని కండక్టర్ మధ్యలోనే నన్ను బస్ దింపేశాడు. నేను ఉరుకోలేదు, ఈ రోజు వాడికి తగిన శాస్తి చేశాను” అన్నాడు.  ఎమిచేశారు అన్నాడు దానయ్య. ఎంచేశానా ! ఈ రోజు టికెట్ కొని కుడా బస్ ఎక్కలేదు” చేప్పాడు ఆసామి

______________________________________________________________________________

మొక్కుబడి నివాళులు

పత్రికలో ప్రచురించిన, ఎస్.ఎం.సుభాని గారి కవిత లొని ఈకింది extracts మన ముందు తరాలవారిపైన, మారిన మనధోరణికి, మొక్కుబడి నివాళులకి దర్పణంపడుతున్నాయి. అవలోకించండి.   

గాంధి, నెహ్రూ, శాస్త్రి, భగత్‌సింగ్….

పుట్టినరోజు ఎవరిగైనా,

ఆ ఒక్కరోజు సందడే సందడి

దేశమంతా ఒకటే హడావుడి.

మరుగున పడిన విగ్రహాలకు

మార్పులుచేర్పులు,రంగులు వేసి

మరీ మరమ్మత్తులు.

ఖద్దరు పంచెకట్టి, నెత్తిన టోపి పెట్టిన

నాయకుల నటనలకు జతబడి,అధికారుల అలజడి.

ఎటుచుసినా సభలుసమావేశాలు,చిందులతో విందులు.

మురిపించే మువ్వన్నెల తోరణాలు

జండా వందనాలు, జతీయ గీతాలాపనలు.

భక్తితో..శ్రద్దాంజలులు, సర్వమత ప్రార్ధనలు. 

మరుసటి రోజు నుండిఎవరి పంథా వారిదే, ఎవరి దందా వారిదే.

తెలుగుదనం

తెలుగువారు తమ వేషభాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, అచార వ్యవహారాలు, ఒక్కటేమిటి, అన్నింటా క్రమక్రమంగా ‘తెలుగుదనం ‘ కోల్పోతున్నారనే విమర్శ ఈ మధ్య సర్వత్రా వినబడుతున్నది. మిగతా అందరు తమ సంస్కృతిని,అచార వ్యవహారాలను నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తుండగా ఒక్క తెలుగువారి విషయం లోనే ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇది అందరు ఆలోచిచవలసిన విషయమే కాదు,చర్చించతగిన విషయము కూడా. కాదంటారా?

కీర్తిశేషులు పిఠాపురం నాగేశ్వరరావు గారు

తెలుగు సిని జగత్తులో జంట దర్శకులని, జంట సంగీత దర్శకులని చాలా మందిని చూసాంకాని, జంట గాయకులన తగ్గవారు మాత్రము శ్రీ మాధవపెద్ది శ్రీ పిఠాపురం మాత్రమే.   శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు: విశ్వనాధం అప్పయమ్మ గార్లు. అసలు వీరి ఇంటిపేరు పాతర్లగడ్డ ‘,  కానీ, చిత్తురు నాగయ్యగారిలాగా, నాగేశ్వరరావుగారు కూడా తమ ఊరిపేరునే తన ఇంటిపేరు చేసుకున్నారు.  పిఠాపురంలోని హైస్కూల్ చదువులువరకు చదువుకున్న నాగేశ్వరరావుకి రంగస్థలం మమకారం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన తండ్రి , ఆ రోజులలో మంచి రంగస్థల నటుడు. గాత్రశుద్ది బాగావున్న నాగేశ్వరరావు, స్నేహితుల ప్రోద్బలముతో, 1944 నుంచి వవ్యకళా సమితి వారి నాటకాల్లో నటించటము మొదలుపెట్టారు.  విశేషమేమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు.  ఆ అనుభవంతో, సినిమాలలో పాడాలనే ఆశతో, ఇంట్లో చెప్పకుండా మదరసు పారిపొయివచ్చారు. తెలిసినవారందరిళ్ళలో తలదాచుకోని తన అదృష్టన్ని పరిక్షించుకున్నారు. 1946 లో విడుదలైన మంగళసూత్రం అనే సినిమాలొ తొలిసారిగా పాడి, సినిరంగంలొ కాలుమోపారు. అప్పటికాయన వయస్సు కేవలం పదహరేళ్ళే . జెమినివారి ప్రతిష్టాత్మక సినిమా చంద్రలేఖ లొ పాడే అవకాశం రావటంతో సినిపరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అప్పటినుంచి, సుమారు పాతికేళ్ళు అనేక సినిమాల్లో పాడి తనసత్తా నిరుపించుకున్నారు.  అది సోలో అయినా, యుగళగీతమైనా సరే, ఆయన పాడినవన్ని దాదాపు హస్యగీతాలే. ఘంటసాల వారితో కలిసిపాడిన “మా ఊళ్ళో ఒక పడుచుంది” (అవేకళ్ళు) పాట, మాధవపెద్దిగారితో కలిసిపాడిన “ అయ్యయో! జేబులోడబ్బులుపొయనే ” (కులగోత్రాలు) పాట, పిఠాపురం గారికి ఎనలేని పేరుతెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరినోళ్ళలో నానుతాయంటే అతిశయొక్తికాదు.  ఆయన తెలుగులోనెగాక, తమిళ, కన్నడ, హింది, సింహళ భాషలలో సుమారు 7వేల పాటలు పాడారు. ఆయన చివరిసారిగా “చల్లని రామయ్య చక్కని సీతమ్మ” అనే పాట 1978లో బొమ్మరిల్లు సినిమాకోసం పాడారు. 1996 మార్చి 5న మృతి చెందిన హస్యగీతాల గోపురం శ్రీ పిఠపురం గారి కిదే శ్రద్దాంజలి. 

 శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన కోన్ని ఆణిముత్యాలు కింద లంకె లో వినగలరు.Music Listing – Music India OnLine 

 

Previous Older Entries Next Newer Entries