నవ్వుకుందాము

ఇద్దరు స్నేహుతుల సంభాషణ:

 “ఎన్నడు లేనిది నువ్వు కర్మ సిద్దాంతాన్ని నమ్ముతున్నవేమిటి?”
“అనుభావపుర్వకముగా తెలుసుకున్నాక నమ్మక తప్పటం లేదు”
“ఏమిటానుభావం?”
“ఇంకేమిటి – పెళ్లి”


డాక్టర్-రోగి సంభాషణ:

“చెప్పండి? ఏమిటి మీ సమస్య?”

“ఏం లేదు! నా భవిష్యత్తు గురించి ఒకటే బెంగ”

“మరేంపర్లేదు! నా దగ్గర మంచి ట్రీట్`మేంట్ వుంది. ఓ సంవత్సరంపాటు తీసుకుంటే చాలు. ఇక నా ఫీజు నెలకి వెయ్యి రుపాయలు చొప్పున అవుతుంది.”

“మీ భవిష్యత్తు సరే! నా భవిష్యత్తు సంగతి ఏమిటని?”


ఆఫిసరు-లేడి కర్క్ మద్య సంభాషణ:”ఆఫిసులో నవలలు చదవటానికా నీకు జీతం ఇస్తున్నది?””లేదు సార్! ఇది నేను ఫ్రీ గా చదువుతున్నాను”.


ప్రకటనలు

పొలీసు భార్య రాత్రి నిద్రలోంచి లేచి భర్తను లేపింది: “ఏమండోయ్ లేవండి, దొంగ వచ్చాడు పట్టుకోండి” 

పొలీసు భర్త: ” అబ్బా! విసిగించక పడుకోవే బాబు ! డ్యూటిలో లేనప్పుడు కూడా పనేమిటి?”

_____________________________________________________________________ 

పట్నం మకాంమార్చిన పరంధామయ్య భర్యతో: “నేను ఎప్పుడు దుబారా ఖర్చు పెడతానని  నా మీద ఊరికే అరుస్తావు కాని, నేనెప్పుడైనా అనవసరంగా ఒక్క వస్తువైనా కోన్నానా?” 

ఆ అమాయకపు ఇల్లాలు: “చాల్లేండి. ఆ నిప్పులార్పే సిలిండరు కొని చాలకాలమైంది. ఒక్క సారైనా వాడిన పాపానపొయ్యారా? అది దుబారా కాకా మరేంటి?” _______________________________________________________________________ 

చదువురాని నౌకరు యజమాని దగ్గరకు ఉత్తరం తెచ్చి “మావూరి నుంచి మా ఆడది ఈ ఉత్తరముక్క రాయించింది బాబు, కాసంత సదివి పెడతరా?” అని అడిగాడు. సరేనని, యజమాని ఉత్తరం అందుకొని చదవటం మొదలుపెట్టాడు.  అంతలో,  నౌకరు వెనుకనుంచి వచ్చి అతని చెవులు మూసివెయటంతో తెల్లబోయి విషయమేమిటని అడిగాడు. దానికా నౌకరు “మొగుడుపెళ్ళాల విషయంకదా బాబయ్య, పరాయోళ్ళు వింటే బావోదని” సంజయిషి ఇచ్చుకున్నాడు.

____________________________________________________________________

నేను పెళ్ళి చేసుకుంటే ఎంతమంది అబ్బాయిలు బాధాపదతారో తెలుసా?” అంది తానెంతో అందగత్తేనని ఫిలయ్యే సౌందర్య.  మరి అంతమందిని చేసుకోవటానికి మీ అమ్మానాన్నాలు ఒప్పుకుంటారా?” చప్పున అడిగింది ఐశ్వర్య.

_______________________________________________________________________ 

 సార్ ! మేనెజర్ గారు మిమ్మలని రమ్మ న్నారు”  చెప్పాడు అటేండర్, మందుబాబు మాణిక్యంతో.  ఆ! అంతమాటన్నరా? నేను ఆయన్ని బ్రాంది అన్నానని చెప్పు పో  అన్నాడు మాణిక్యం మత్తులో జోగుతు.   _____________________________________________________________________  

చాలసేపటి తరువాత వచ్చిన సిటిబస్ లొనికి తొసుకుంటు వెళ్ళి, వెంబటే తిరిగి దిగిన ఆసామిని చూచి విషయమేమిటని ఆశ్చ్యర్యంతో అడిగాడు దారినపోయె దానయ్య. దానికి ఆ ఆసామి  “మొన్న ఒకరోజున టికెట్ లేకుండా బస్సేక్కానని కండక్టర్ మధ్యలోనే నన్ను బస్ దింపేశాడు. నేను ఉరుకోలేదు, ఈ రోజు వాడికి తగిన శాస్తి చేశాను” అన్నాడు.  ఎమిచేశారు అన్నాడు దానయ్య. ఎంచేశానా ! ఈ రోజు టికెట్ కొని కుడా బస్ ఎక్కలేదు” చేప్పాడు ఆసామి

______________________________________________________________________________

మునిమానిక్యం నరసిం హారావు – చెణకులు

తెలుగు సాహిత్యంలో, కాంతం కథలతో అయస్కాంతంలా ఆకర్షించిన మునిమానిక్యం నరసిం హారావు గారు   విసిరిన కొన్ని చెణకులు:

పొగడ్త:   తినేవాడికితప్ప ఇతరులకు అసహ్యం కలిగించే వృత్తాంతం.  

——————————————————————————————-

పట్టుదల : మనలో ఉంటే సుగుణం. అదే ఇతరులలొ ఉంటే దానిని మొండి పట్టు అంటాము. తలబిరుసుతనం అని కూడా అనవచ్చు.

——————————————————————————————————– 

బుద్దిహీనుడు: పెద్ద బుద్దిహీనుల చేత గుణవంతుడని   పిలువబడేవాడు.

——————————————————————————————————–

ఆశ : అన్నీ నాశనమైన పోయిన తరువాత చివరకు మిదిలేది.

—————————————————————————————————– 

యౌవనము: ఆడపిల్ల వంక ఆశగా చూచే వయస్సు. 

—————————————————————————————————–

బేరము: అమ్మేవాడు కొనేవాడూ ఒకరినొకరు మొసగించుకోవడానికి చేసే ప్రయత్నము.

——————————————————————————————————– 

క్లాసిక్:  ఒక రకం పుస్తకం.  దాన్ని ఎవరూ చదవరు. కాని చదివినట్లు మాట్లాడుతారు.

  ——————————————————————————————————– 

ప్రకటన : నీవు బాగా ఎరిగున్న వస్తువునే, నీవు ఎప్పుడూ చుడనట్టిదిగాను దానిని గురించి విననట్టిదిగానూ భావింపజేసే వర్ణన.

మునిమానిక్యం నరసిం హారావు – గిలిగింతలు

తెలుగు సాహిత్యంలో, కాంతం కథలతో అయస్కాంతంలా ఆకర్షించిన మునిమానిక్యం నరసిం హారావు గారు   విసిరిన కొన్ని చెణకులు, మరికొన్ని గిలిగింతలు:

__________________________________________________________________

పురపాలక సంఘ సభ్యులలో సగం మంది బుద్దిహీనులు అని ఒక పెద్దమనిషి అనే సరికి పెద్ద గొడవ బయలుదేరింది. ఆ మాట ఉపసం హరించుకోవలెనని సభ్యులు పట్టుబట్టారు. దానికి ఆ పెద్ద మనిషి విచారాన్ని నటిస్తూ మళ్ళీ ఇట్లా అన్నాడు.  

సరే ! ఉపసం హరించుకొంటాను. పురపాలక సంఘ సభ్యులలో సగం మంది బుద్దిహీనులుకారు” అని పై వాక్యాన్ని దిద్దుకొన్నాడు. _______________________________________________________________________ 

ఒకడు డాక్టరు తో  “నిద్ర లేచిన తర్వాత ఒక అరకంట సేపు తల తిరుగుతున్నట్లు వుంటుంది. డబ్బు పెట్టి మందు పుచ్చుకొనే శక్తి లేదు. ఏదైనా ఉపాయం చెప్పండి.”

డాక్టరు: “ఆ అరగంట అయిన తర్వాత నిద్ర లేవయ్యా”  _______________________________________________________________________ 

కుమార్తే  ఏడుస్తూ తల్లి దగ్గర కొచ్చింది.

ఏం తల్లి! ఎందుకూ ఏడుస్తున్నావూ?”

నా భర్త నాస్తికుడమ్మా. ఆ సంగతి తెలియక నన్ను ఇచ్చి పెండ్లి చేశారు మీరు.”

ఏమంటాడు విపులంగా చెప్పు?”

పాపం చేసినవాళ్ళు నరకానికి పోతారూ”  అన్నాను. దానికి ఆయన ” నరకం వుందని నాకు నమ్మకం లేదు”అన్నారు.

ఓస్! ఇంతేకదా! మనం ఇద్దరం కలిశేమా అంటే నిమిషం లొకి నరకం వుందని ఆయనకు నమ్మకం కలుగజేయవచ్చు. అదెంత పని!” అంది తల్లి.  ________________________________________________________________________ 

నీ భర్త పుస్తకాల పురుగా ఏమిటమ్మా?”

అబ్బే! అదేం కాదు.  మాములు పురుగే.” __________________________________________________________________________ 

హిప్నోటిజం,  అంటే యేమిటి అక్కా?” అడిగింది చెల్లి. 

 మనిషిని ప్రభావితం చేసి, నీవు యేది చెపితే అది చేసేటట్లు చేయడం” అన్నది అక్క

” అదా! అది హిప్నోటిజం కాదు. అది వివాహం” ఠక్కునంది చెల్లి. __________________________________________________________________ 

ఓ డాక్టారు భార్యా సమేతుడై పారులో విహరిస్తూ వుండ్గా ఒక చక్కని స్త్రీ  డాక్టారుగారికి నమస్కరించింది.

భార్య అడిగింది: “ఆవిడ్ మీది ఎట్లా తెలుసు?. ఎందుకు పరిచయం అయింది?”

డాక్టారు అన్నారు : “వృత్తిరీత్యా పరిచయం”

వెంటనే భార్య అడిగింది : ” మీ వృత్తా? ఆవిడ వృత్తా?”   _______________________________________________________________________

స్కూలుకు కొత్త రేదియొ వచ్చిన సంగతి ప్రధానోపాధ్యాయుడు సంతోషంగా చెబుతున్నాడు పెల్లలతో. 

  రేదియొ పాఠశాల నిధులలోనుంచి  కొన్నాము.

ప్రధాన సహయోపాధ్యాయుడు లౌడ్ స్పీకరును తన భార్య జ్ఞాపకార్ధము బహూకరించాడు. _____________________________________________________________________   

రోగి: “డాక్టరు గారూ కాళ్ళనొప్పులబాధ భరించలేకుండా ఉన్నానండీ.”

డాక్టరు: “మీరు ఆ విషయం ఆలోచిందకండీ. ఆ నొప్పులు నాకు వదిలేశెయ్యండి.”

రోగి:  “మీరు తీసుకొనేటట్లైతే నాకు సంతోషమే, కాని అవి నన్ను వదలటం లేదు.”

డాక్టరు: “నేను వదలిస్తాను. ఆ విషయం నాకు వదిలేశెయ్యండి”.

రోగి:   ఎంత బాధ అనుకొన్నారు డాక్టరు గారు! అనేక సార్లు విషం పుచ్చుకోని చనిపోదము అనిపిస్తూంది….” డాక్టరు: ఆ విషయం నాకు వదిలేశెయ్యమని చెప్పానా”” “.

____________________________________________________________________

గిలిగింతలు

జ్యోతిష్కులకూ, రాజకీయ నాయకులకూ పోలికేమిటి?” 

ఇద్దరూ ఇతరులకి భవిష్యత్తును అందంగా చూపి, తమ పబ్బం గడుపుకుంటారు.”

___________________________________________________________ 

రాత్రి సెకండ్ షోకి నీతో వచ్చిన అమ్మాయి చెల్లెలా?”

అవును! నా భార్యకి.”

______________________________________________________ 

మా హొటల్ లో భోజనం చేయండి సారు… మీ ఇంట్లో వున్నట్లుగానే వుంటుంది” అన్నాడు హొటల్ మెనెజర్.    

పెట్టేటప్పుడు సణగరుగా” అడిగాడు కస్టమర్ భయంగా.    _____________________________________________________________ 

చుట్టాలు రాకముందు కాకి అరుస్తుంది. మరి చుట్టాలు వెళ్ళిపోయాక ఎవరు అరుస్తారు?”

కిరాణ కొట్టు వాడు”.

______________________________________________________________

our taxation deptts..

A little boy wanted Rs.50 very badly and prayed for weeks, but nothing happened.

Finally he decided to write God a letter requesting the Rs.50. When the postal authorities received the letter addressed to “
God, India”, they decided to forward it to the Finance Minister of
India as a joke.

The Finance Minister was so amused, that he wanted to send some money to the boy. He instructed his secretary to send the little boy Rs.20. The Finance Minister thought this would appear to be a lot of money to a little boy, and he did not want to spoil the kid.

The little boy was delighted with Rs.20, and decided to write a thank you note to God, which read:

“Dear God,Thank you very much for sending the money. However, I noticed that you sent it through the ‘Finance Minister’ in
Delhi, and those fellows deducted Rs. 30 as taxes…” 

నాకు నచ్చిన జోకులు కోన్ని…

“కారున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావటగా? ఇంకేం షావుకారువయ్యావన్నమాట”
“జీతం లేని డ్రైవర్నయ్యానంతే”
______________________________

“పిన్నిగారు! నేను పాడుతాను, మీరు తాళం వేస్తారా” అడిగింది ఆండాళ్ళు
“ఓ అలాగే! మొదలుపెట్టు” అని ఆవిడ పాటందుకోగానే లేచి గది బయట గొళ్ళెం పెట్టి తాళం వేసి వెళ్ళిపోయింది పక్కింటి పార్వతమ్మ.
______________________________

“మీ కుక్క కి నేనంటే ఎంత అభిమానమో! నేనొస్తే అస్సలు మొరగనే మొరగదు.”

“కరక్టే! స్వజాతి అభిమానం అంటె మాటలా?”
________________________________

“ఇప్పటికీ స్వాతంత్ర్యాన్ని పూర్తిగా పోందలేని భారతీయులురైనా వున్నారా ఈ దేశం లొ?”  

“లేకేం?..బోలెడెంత మంది వున్నారు.”

“ఏవరు వాళ్ళు?”

“పెళ్ళైన మొగాళ్ళు”