“చేయెత్తి జైకొట్టు తెలుగోడా!”

సచీదేవి గారి వ్యాఖ్యలో “వెలికి తీద్దాం ఓకనాటి ప్రాభవం; తెలుగువారమని గర్వంగా చాటుదాం” అన్నవాక్యం స్పుర్తితో, నాటి పరిస్థితులకి, నేటి సమకాలీన రాజకీయలకి దర్పణం పట్టిన ‘వేములపల్లి శ్రీకృష్ణ’ గారి రచన 

“చేయెత్తి జైకొట్టు తెలుగోడా!” ఇక్కడుంచుతున్నాను. ముఖ్యంగా చివరి రెండు పద్యాలు గమనించండి,  ప్రస్థుతం ప్రభలుతున్న ప్రాంతీయవాదనికి అచ్చుగుద్దినట్లు సరిపొతున్నాయి.

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

గతమెంతో ఘనకీర్తి గలవోడా!

సాటిలేని జాతి – ఓట మెరుగని కోట

నివురుగప్పి నేడు – నిదురపోతుండాది

జైకొట్టి మెల్కోలుపు తెలుగోడా!

గతమెంతో ఘనకీర్తి గలవోడా!               || చేయెత్తి || 

వీర రక్తపుధార – వారబోసిన సీమ

పలనాడు నీదెరా – వెలనాడు నీదెరా

బాలచంద్రుడు చూడ ఎవడోయి!

తాండ్ర పాపయ్య గూడ నీవొడూ!            || చేయెత్తి || 

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల

మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే

వీరవనెతలగన్న తల్లేరా!

ధీరమాతల జన్మభూమేరా!                   || చేయెత్తి || 

నాగర్జునుడికొండ, అమరావతీ స్థూపం

భావాల పుట్టాలో – జీవకళ పొదిగావు

అల్పుడను కావంచు తెల్పావు నీవు!

శిల్పినని చాటావు దేశదేశాలలో!             || చేయెత్తి || 

దేశమంటే మట్టి కాదన్నాడు

మునుషులన్న మాట మరువబోకన్నాడు

అమర కవి గురజాడ నీవాడురా!

ప్రజల కవితను చాటి చూపాడురా!           || చేయెత్తి || 

రాయలేలిన సీమ – రతనాల సీమరా

దాయగట్టె పరులు – దారి తీస్తుండారు

నోరెత్తి యడగరా దానోడా!

వారసుడ నీవెరా తెలుగోడా!                    || చేయెత్తి || 

కల్లోల గౌతమీ – వెల్లువల కృష్ణమ్మ

తుంగభద్రా తల్లి – పోంగిపొరలిన చాలు

ధాన్యరాసులే పండు దేశానా!

కూడు గుడ్డకు కొదవలేదన్నా!                 || చేయెత్తి || 

ముక్కోటి బలగమోయ్ – ఒక్కటై మనముంటే

ఇరుగు పొరుగులోన – వూరు పేరుంటాది

తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!

సవతి బిడ్డల పోరు మనకేలా!                  || చేయెత్తి || 

పెనుగాలి వీచింది – అణగారి పోయింది

నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది

చుక్కాని బట్టారా తెలుగోడా!

నావ దరిజేర్చరా – మొనగాడా!               || చేయెత్తి || 

ప్రకటనలు

జున్ 4ఆరుద్రవర్దంతి సంధర్భంగా, ఆ మహానుభావుని స్మరించుకుందాం. 
 ఆరుద్ర

 ఆరుద్రఅభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు అయిన ఆరుద్రపూర్తిపేరు భాగవతుల శివశంకర శాస్త్రి.   సినీ గీత రచన కాక ఎంతో వైవిధ్యంగల గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య వ్యాసాలు, అనేక పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఏకకాలంలో వ్రాసి మెప్పించన సాహితి ధృవతార ఆరుద్ర. కూనలమ్మ పదాలు, త్వమేవాహం , సినీవాలి, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలు,  దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు,  శ్రీకృష్ణదేవరాయ , కాటమరాజు కథ వంటి కధా రూపకాలు తో పాటు కొన్ని నవలలనూ, మరికోన్ని కథలనూ కూడా రచించాడు. వేమన వేదం, మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు.సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఆరుద్ర విస్తూత రచన పటిమకు  పరాకాష్ట.    ఆరుద్ర వ్రాసిన కూనలమ్మ పదాలు, ఆయనలోని సాహిత్యఅభినివేశాన్ని, భాషపై పట్టుని పట్టి చూపిస్తాయి. నాకు నచ్చిన కొన్ని

ఆరుద్ర కూనలమ్మ పదాలు

సర్వజనులకు శాంతి

స్వస్తి, సంపద, శ్రాంతి

 నే కోరు విక్రాంతి

ఓ కూనలమ్మ

 

ఈ పదమ్ముల క్లుప్తి

ఇచ్చింది సంత్రుప్తి

 చేయనిమ్ము సమాప్తి

 ఓ కూనలమ్మ

 

సామ్యవాద పథమ్ము

సౌమ్యమైన విధమ్ము

 సకల సౌఖ్యప్రదమ్ము

ఓ కూనలమ్మ   

మధువు మైకము నిచ్చు

వధువు లాహిరి తెచ్చు

పదవి కైపే హెచ్చు

ఓ కూనలమ్మ్ 

కోర్టుకెక్కిన వాడు

కొండనెక్కిన వాడు

వడివడిగ దిగిరాడు

ఓ కూనలమ్మ

 

పాత సీసాలందు

నూతనత్వపు మందు

నింపితే ఏమందు?

ఓ కూనలమ్మ

 

తగిన సమయము చూచి

 తాను వేయును పేచి

 పాలిటిక్సుల బూచి

ఓ కూనలమ్మ

   

కీర్తిశేషులు పిఠాపురం నాగేశ్వరరావు గారు

తెలుగు సిని జగత్తులో జంట దర్శకులని, జంట సంగీత దర్శకులని చాలా మందిని చూసాంకాని, జంట గాయకులన తగ్గవారు మాత్రము శ్రీ మాధవపెద్ది శ్రీ పిఠాపురం మాత్రమే.   శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు: విశ్వనాధం అప్పయమ్మ గార్లు. అసలు వీరి ఇంటిపేరు పాతర్లగడ్డ ‘,  కానీ, చిత్తురు నాగయ్యగారిలాగా, నాగేశ్వరరావుగారు కూడా తమ ఊరిపేరునే తన ఇంటిపేరు చేసుకున్నారు.  పిఠాపురంలోని హైస్కూల్ చదువులువరకు చదువుకున్న నాగేశ్వరరావుకి రంగస్థలం మమకారం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన తండ్రి , ఆ రోజులలో మంచి రంగస్థల నటుడు. గాత్రశుద్ది బాగావున్న నాగేశ్వరరావు, స్నేహితుల ప్రోద్బలముతో, 1944 నుంచి వవ్యకళా సమితి వారి నాటకాల్లో నటించటము మొదలుపెట్టారు.  విశేషమేమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు.  ఆ అనుభవంతో, సినిమాలలో పాడాలనే ఆశతో, ఇంట్లో చెప్పకుండా మదరసు పారిపొయివచ్చారు. తెలిసినవారందరిళ్ళలో తలదాచుకోని తన అదృష్టన్ని పరిక్షించుకున్నారు. 1946 లో విడుదలైన మంగళసూత్రం అనే సినిమాలొ తొలిసారిగా పాడి, సినిరంగంలొ కాలుమోపారు. అప్పటికాయన వయస్సు కేవలం పదహరేళ్ళే . జెమినివారి ప్రతిష్టాత్మక సినిమా చంద్రలేఖ లొ పాడే అవకాశం రావటంతో సినిపరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అప్పటినుంచి, సుమారు పాతికేళ్ళు అనేక సినిమాల్లో పాడి తనసత్తా నిరుపించుకున్నారు.  అది సోలో అయినా, యుగళగీతమైనా సరే, ఆయన పాడినవన్ని దాదాపు హస్యగీతాలే. ఘంటసాల వారితో కలిసిపాడిన “మా ఊళ్ళో ఒక పడుచుంది” (అవేకళ్ళు) పాట, మాధవపెద్దిగారితో కలిసిపాడిన “ అయ్యయో! జేబులోడబ్బులుపొయనే ” (కులగోత్రాలు) పాట, పిఠాపురం గారికి ఎనలేని పేరుతెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరినోళ్ళలో నానుతాయంటే అతిశయొక్తికాదు.  ఆయన తెలుగులోనెగాక, తమిళ, కన్నడ, హింది, సింహళ భాషలలో సుమారు 7వేల పాటలు పాడారు. ఆయన చివరిసారిగా “చల్లని రామయ్య చక్కని సీతమ్మ” అనే పాట 1978లో బొమ్మరిల్లు సినిమాకోసం పాడారు. 1996 మార్చి 5న మృతి చెందిన హస్యగీతాల గోపురం శ్రీ పిఠపురం గారి కిదే శ్రద్దాంజలి. 

 శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన కోన్ని ఆణిముత్యాలు కింద లంకె లో వినగలరు.Music Listing – Music India OnLine 

 

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి

devula.gif

మావికొమ్మ, కోయలమ్మ, మాధవీలత, కోవెలతోట లాంటి తేట తెలుగు మాటలవింటే, ప్రతి తెలుగు వాడి మది పులకరిస్తుంది. ఈ తెనెలోలుకు తియ్యనీ పదాల సృష్టికర్త, సాహితిస్రష్ట  శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి  ఈరోజు . ఈ సందర్భంగా దేవులపల్లి వారి స్మరణలో… వారి కలం నుండి. జాలువారిన.. ఓ పదహారణాల ఆణిముత్యము. 

మనసున మల్లెల మాలలూగెనె      

కనుల వెన్నెల డొలలూగెనె          

ఎంత హాయు ఈరేయు నిండెనో    

ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో       

కోమ్మల గువ్వల సవ్వడి వినినా   

రెమ్మల గాలుల సవ్వడి వినినా    

ఆలలు కొలనులొ గలగల మనినా   

డవుల వెణువు సవ్వడి వినినా      నీవువచ్చెవని నీపిలుపె విని    

న్నుల నీరెడి కలయ చూచితిని   

గడియె యుక విడిచి పొకుమ     

ఎగసిన హృదయము పగులనీకుమ     ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో   

ఎంత హాయు ఈరేయు నిండెనో  

కె.విశ్వనాథ్

“కళాతపస్వి” పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గారి కి జన్మదిన శుభాకాంక్షలు.

viswanath_small.jpg

అత్భుతమైన సినికళఖండాలు  సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన విశిష్ట వ్యక్తి, కె.విశ్వనాథ్.   శ్రీ విశ్వనాథ్ గారు 1930 సంవత్సరము,ఫిబ్రవరి 19 న లో విజయవాడ లో జన్మించారు. మదరసు లోని ఒక స్టూడియోలో టెక్నీషియనుగా సినిమా జీవితప్రస్తానాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు హిరో నటించిన ఆత్మ గౌరవంవిశ్వనాథ్ గారికి దర్శకుడిగా మొదటి సినిమా. సిరిసిరిమువ్వ సినిమా ఆయన లోని ప్రతిభను  వెలుగులోకి తెచ్చింది. విశ్వనాథ్ గారి చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం‘. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగుసినిమాకే కళాసంస్కారం నేర్పింది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు శ్రీ విశ్వనాథ్ గారు. భారతీయ సాంప్రదాయ కళలకు పెద్దపిట వేస్తూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వరాభిషేకం మొదలైన అణిముత్యాలున్నవి. సాంప్రదాయ కళలూ, సమాజిక స్పౄహ వంటి విభిన్నాంశాలతో సవ్యసాచిలా చిత్రాలు నిర్మించారు. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాల తో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు నిర్మించారు. అనేక ప్రభుత్వ అవార్డులతోబాటు, ప్రజా రివార్డులని కూడా పొందిన విశ్వనాథ్ గారికి భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.  ఆయన ‘శంకరాభరణం’ కు జాతీయ పురస్కారం తో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది.   

శ్రద్డాంజలి

కీర్తి శేషులు ఘంటసాల గారి వర్ధంతి ఫిబ్రవరి 11, సందర్భమున , మహనియుని తలుచుకోవటం ప్రతి తెలుగువాడి కనీస భాధ్యత. ఘంటసాల గారు 1974 ఫిబ్రవరి 11 దేవేంద్రుని సభ లో గానకాచేరి కోసమై భువిని విడిచి దీవికి వెళ్లారు. ఒకానొక సందర్భములో , ఘంటసాల గారి గురించి శ్రీ వేటూరి వారు ఇలా అన్నారు.కర్ణాటక, హిందూస్తానీ సంగీతాలతో పాటు తెలుగు వారికి మరొక సంగీతం ఉంది, అదే ఘంటసాల వారి సంగీతము“.  అంతటి అజరామారమైనది ఘంటసాల గారి గాన మాధుర్యం.
శ్రీ ఘంటసాల వారి సంబందించిన కొన్ని వివరాలు;
స్వస్తలం : టేకుపల్లి గ్రామం, కృష్ణా జిల్లా లోని దివిసీమ దగ్గర;
పుట్టిన తేదీ: 1922 డిసెంబెర్ 4 ;
పుట్టిన వూరు: చౌటుపల్లి గ్రామం, కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా
తల్లిదండ్రులు: రత్నమ్మ గారు, సూర్యనారాయణ గారు
గురువులు: ద్వారం వెంకట స్వామి నాయుడు గారు; ‘ హరికధ పితామహాఆదిభట్ల నారాయణ దాసు
కుటుంబం: భార్య : శ్రీమతి సావిత్రమ్మ
కుమారులు: విజయ్‌కుమార్; రత్నాకుమార్
కుమార్తెలు: శ్యామల; సుగుణ; శాంతి
అనుంగు సహచరుడు: సంగీత రావు. ఇక ఘంటసాల వారి సంగీతము, గాన మాధుర్యం ఎంత చెప్పిన తరగదు. భగవత్ గీత, దేశభక్తి గీతాలు, పద్యాలు, సినీగీతాలు, జానపద గీతాలు లలిత గీతాలు మొదలైనవి ఎన్నో ఘంటసాల గారి తో గళ సాంగత్యం చేసాయి. సినిమాలో అభినయించే కధానాయకుడికి తగినట్టు గాత్రాన్ని, స్వరాన్ని మార్చే ప్రక్రియకు ఆయనే ఆద్యుడు. అంతటి గాత్ర తేజస్సు ఘంటసాలది.

“సైలెన్స్”…తెలుగు మాష్టారి కి జన్మదిన శుభాకాంక్షలు.

శ్రీ రావి కొండలరావు గారి పుట్టినరోజు ఫిబ్రవరి 11. ఆ సందర్భముగా ఈ తెలుగు సినిమా దిగ్గజానికి, నిజమైన లివింగ్ లెజెండ్ కి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ రావి కొండలరావు గారు మంచి రచయత, మంచి నటుడు మత్రమే గాక, నాటి కాలం సిని దిగ్గజాలకి తలలో నాలుకగా మెలిగిన వ్యక్తి. విజయచిత్ర పత్రికను విజయపధంలొ నడిపారు. శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు అంటే ఎన్.టి.ఆర్. ఏలా గుర్తుకోస్తారో,  తెలుగు మాష్టారు అంటే రావి కొండలరావు గారు గుర్తుకోస్తారు.  రావి కొండలరావు గారి సతిమణి శ్రీమతి రాధాకుమారి గారు సహజనటి. హాస్యరసపోషణలో వారిద్దరు మేడ్ ఫర్ ఈచదర్. బౄందావనం సినిమాలో వారిద్దరి నటన ఎంతో సహజంగా వుండి అందరి మన్ననలు పోందింది.

మూడుపాతికల వయసులొ కూడా ఆయన ఎంతో ఉత్సాహాంగా నడిపే హాస్యరస ప్రోగ్రాం వరల్డ్ స్పేస్ శాటిలైట్ రెడియో తెలుగు చానల్ స్పందన శ్రోతలకి సుపరిచయమే.  

శ్రీ రావి కొండలరావు గారికి ఘంటసాల గారంటే ప్రత్యేకమైన అభిమానం. ఘంటసాల గారు 1974 ఫిబ్రవరి 11 న కన్నుమూశారు. అప్పటి నుండి రావి కొండలరావు గారు తన పుట్టిన రోజు పండుగని జరుపుకోవటం మానేశారుట. అలావుండేవి పాతతరం వారి అభిమానాలు, ఆప్యాయతలు. ఇప్పటి వారిలా, సెలబ్రెటినా?  లెజెండా? అన్న డౌట్లు  అప్పటివారికుండేవి కావు.