గ్రౌండ్ రియాలిటిస్-2

నాటపాను సందర్శించి, గంభీరమైనవిషయం మీద వ్యాఖ్యాలువారందరికి నాకృతజ్ఞతలు.

బుడుగు గారు!
ఇది సామ్రాజ్యవాదానికి, సార్వభౌమాధికారానికి సంబందించినంత పెద్దవిషయం కాదు అనేది నాఅభిప్రాయం. ఈ పెద్దపదాలు దేశాలకి సంబందించినవి. ఇక్కడ జరుగుతున్నది, కేవలం ఒక రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలుచేయలనే అరాచకీయకుట్రమాత్రమే. ఈ పరమనీచరాజకీయ పరమపదసోపానపటంలో నిచ్చెనలెక్కేవారు రాజకీయనాయకులు, పాములుచేత కరవపడేవారు సామాన్యులు (ప్రస్తుతం విద్యార్ధులు + ఉద్యోగులు).

సుజాతగారు!
సామాన్యులుకానివారే మేధావులు నాఅభిప్రాయం. జనబాహుళ్యములోని సామాన్యులను, సమకాలీనులకు దిశానిర్దేశముచేసి వారికి సరైనమార్గానుసరణ చేయగలిగినవారిని మత్రమే మేధావులు అని గౌరవించాలితప్ప, భావోద్వేగాలపేరిట తమ మాటకారితనంతో, తెంపరితనంతో సామన్యులధనప్రాణాలతో రాజకీయచదరంగం ఆడేవారుకాదు.

శ్రేయోభిలాషిగారు!
బాగాగుర్తించారు. ప్రస్తుతం జరుగున్నది మనరాష్త్రంలో జరుగుతున్నది ఆటావీకన్యాయమే.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. budugoy
  డిసెం 26, 2009 @ 01:34:31

  ఇలాంటి చర్చలు ఇంటర్నెట్‌లో తెగవు. నేను సార్వభౌమాధికారం అంటే దానికో నేననివి తగిలించి సామ్రాజ్యవాదం అంటగడుతున్నారు. తెలంగాణా దేశం అడగట్లేదు. భారతరాజ్యాంగానికి కట్టుబడే ఉంటాం కాని మా రాష్ట్రం మీద మాకు అటానమస్ పవర్స్ కావాలని అడుగుతునారు.

  మీకు నిజంగా చర్చించే సత్తా ఉంటే తెలంగాణా వాదులు చెప్పే సంఖ్యలు తప్పని నిరూపించండి. పెద్దమనుషుల ఒప్పందం ఎందుకు అమలు చేయలేదో చర్చించండి. నాబార్డ్ రుణాల్లో తెలంగాణకు 130లో కేవలం పదికోట్లే ఎందుకిచ్చారో చర్చించండి. అఖిల పక్షాలు సై అన్న గంటల్లోనే కేంద్రం తెలంగాణకు సై అంటే ఆంధ్ర రాజకీయనాయకులు ఎందుకు మళ్ళీ వెనకడుగు వేశారో వివరించండి.

  అంతే కాని హైదరబాదులో ఎడాపెడా ఇన్వెస్టు చేసిన రాజకీయనాయకులు ఏదో స్వార్థంతో మాట్లాడుతుంటే వాళ్ళ బుట్టలో పడకండి. తెలంగాణ వస్తే అభ్యంతరం చెప్పాల్సింది కేవలం సీమ ప్రజలు. ఎందుకంటే వాళ్ళు స్వతంత్రరాష్ట్రంగా మనలేరు అలాగని ఆంధ్ర చేసే అన్యాయాన్ని తట్టుకోలేరు. అసలు ఆంధ్రవాసులకు అభ్యంతరమేంఇటి? భారత రాజ్యాంగం ప్రకారం ఎవ్వరమైనా ఎక్కడైనా ఇళ్ళు కొనుక్కోవచ్చు. ఆస్తులు కొనుక్కోవచ్చు. దాన్ని కాదనే, కబ్జా చేసే అధికారం kcr కాదు గదా వాడి బాబుగ్గూడా లేదు. ఏదో బూచి చూపగానే అహోహో, ఒహోహో అని భయపడకండా కాస్త వివేకంతో ఆలోచించండి.

  చిన్న రాష్ట్రాల వల్ల ఎక్కువ నగరాలు, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. సామాన్యులకేమీ నష్టం లేదు. ఎవరికైనా నష్టం ఉంటే అది కేవలం హైదరబాదులో ఎడా పెడా వక్రమార్గాల్లో ఆస్తులు సంపాదించి పవర్పోతే అవి నిలుపుకోలేని ఘటికులకు మాత్రమే.

 2. budugoy
  డిసెం 26, 2009 @ 02:41:17

  మరో విషయం. రాష్ట్ర విభజన అంటే రాత్రికి రాత్రే గీత గీసి తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి వ్యవహారం కాదు. రాష్ట్ర విభజన అనేది ఒక elaborate process. ఉమ్మడి ఆస్తులు, నదీ జలాలు, ఉద్యోగుల సాధకబాధకాలు అన్నీ చర్చించకుండానే రాష్ట్రం విడిపోతుందా? ఒకసారి విడిపోవడానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ గ్రౌండ్ రియాలిటీస్ వాటంతట అవే జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగిన సంగతి వేరు. ఇన్నాళ్ళూ తెలంగాణా అంశం మీద గోడమీదపిల్లుల్లా గమ్మున కూర్చున్న వాళ్ళంతా, రాత్రికి రాత్రే యూ-టర్న్ తీసుకోని హిపోక్రసీ అంటే ఏమిటో ఒక్కసారిగా తేల్చి చెప్పారు.
  ఇన్ని గొడవలు జరుగుతున్నా డిసెంబరు పదకొండున జి.ఒ.నొ.1849 ఎలా రాగలిగింది? ఆంధ్ర జిల్లాలకు 110 కోట్లు ఇచ్చి తెలంగాణ జిల్లాలకు 10 కోట్లు ఎలా ఇవ్వగలిగారు? అంటే బరితెగించిన దొంగతనం కాదా? ఇలా కడుపుమండే తెలంగాణ వాసులు ప్రత్యేకరాష్ట్రం కోరుకుంటున్నారు. కోస్తాంధ్ర ప్రజలు తీసుకున్న స్టాన్స్ నాకింకా ఆశ్చర్యంగానే ఉంటుంది. వీళ్ళు తమ రాజకీయనేతలు చెప్పిన మాటలు విని మోసపోయిన అమాయకులా? లేక వాళ్ళతో కుమ్మక్కై ఈ దోపిడిని సపోర్ట్ చేసే తెలివి మంతులా?
  ఇంత గొడవలో కూడా నాకు ఎవరి మీదైనా సింపతీ ఉందంటే సీమ వాసుల మీద. వాళ్ళకు అటు ఆంధ్ర పాలనలో (baring YSR) ఒరిగిందీ లేదు. ఇప్పుడు రాష్ట్రం రెండు ముక్కలైనా ఒరిగేదేమీ లేదు.
  సుధాకర్ గారు, మీరు కాస్త నిజాయితీగా ప్రశ్నించారని మీకు సమాధానమిచ్చాను. కేవలంతో ద్వేషంతో రాసే బ్లాగులు/కామెంట్ల వైపు నేను కనీసం కన్నేసి కూడా చూడను. ఆంధ్ర బ్లాగైనా సరే. తెలంగాణ బ్లాగైనా సరే. మీరు కాస్త ఆబ్జెక్టివ్గా ఆలోచించి చూడండి.

  చివరిగా ఒక మాట. ప్రైవేటు రంగంలో పని చేసే వారికి రాష్ట్ర విభజనతో ఏం నష్టం వాటిల్లుతుంది. భారతదేశమంతా ఒకటై ఒక రాజ్యాంగాన్ని పాటించినంత మేరకు హైదరాబాదు ఏ రాష్ట్రంలో ఉంటేనేం? ఏ? ఇప్పుడు బెంగళూరులో ఉంటూ ఎంతమంది తెలుగువాళ్ళు ఉదోగాలు చేసుకోవట్లేదు? రాష్ట్రం వేరైనంత మాత్రాన వీసాలైతే/పర్మిట్లు (loose mouths like kcr might say what ever he wants. But this is India first and state comes later.) అఖ్ఖర్లేదు కదా. హైదరాబాద్ మీ ఊరికి దూరమైతే కాదు కదా? తెలంగాణలో పనిచేసే ఆంధ్ర గవర్నమెంటు ఉద్యోగులకు సమస్యా? అంటే అవును. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సి వస్తుంది. its unfair. but compare it to the injustice for folks in nalgonda etc..

 3. chavakiran
  డిసెం 26, 2009 @ 04:29:35

  Budugoy,

  మీ ప్రశ్నల్లోనే జవాబులు కూడా ఉన్నాయి. ఒక సారి జాగ్రత్తగా చదవండి.
  ఉదాహరణకు
  — హైదరాబాదు ఏ రాష్ట్రంలో ఉంటేనేం? ఏ?
  తెలంగాణా ఏ రాష్ట్రంలో ఉంటేనేం ఏ

 4. budugoy
  డిసెం 26, 2009 @ 08:50:32

  ఇన్ని ప్రశ్నల్లో మీరు ఆన్సర్ చేయగలిగింది అదా 🙂 lol. ఇంకా దోపిడి చేసుకుని తిన్నాక ఎవరి దగ్గరనుండైతేనేం? అనలేదు. ముందే చెప్పినట్టు స్కూల్ డిబేట్లకు పనికొచ్చే ఈ వన్-లైనర్లకు నేను సమాధానం ఇవ్వదలచుకోలేదు. సుధాకర్ గారు ఒక విచిత్రమైన ఎక్స్ప్లనేషన్ ఇచ్చి దీన్ని ట్రివియలైజ్ చేస్తుంటే సమాధానమిచ్చాను. చావా, I always respect you for your work on telugu blogs. అక్కడ అద్యంతాలు తెలుసుకొని ఎంత ఓపిగ్గా పని చేశారో ఈ సమస్య గురించి కూడా వీలైనంత సమగ్రంగా తెలుసుకోండి. తరవాత మాట్లాడొచ్చు.

 5. chavakiran
  డిసెం 26, 2009 @ 16:20:23

  >>ఇలాంటి చర్చలు ఇంటర్నెట్‌లో తెగవు
  అవును.
  — తెలంగాణా దేశం అడగట్లేదు
  అడగవచ్చు కదా. ఎవరు వద్దన్నారు. భయం కాకపోతే. అప్పుడు పూర్తి సెల్ఫ్ రూల్ వస్తుంది. శుబ్బరంగా మన దొరల కాళ్ల దగ్గర బతుకెల్లదియ్యొచ్చు. ఇంకెవరికీ దోపిడీ చేసే అవకాశం ఇవ్వకుండా. తరువాతి తరాల సంగతి తరువాత, వారి కర్మ.
  — భారతరాజ్యాంగానికి కట్టుబడే ఉంటాం కాని మా రాష్ట్రం మీద మాకు అటానమస్ పవర్స్ కావాలని అడుగుతునారు

  ఇప్పుడు ఉండేది కూడా మీ రాష్ట్రమే అనేది నా బాధ.

  — మీకు నిజంగా చర్చించే సత్తా ఉంటే తెలంగాణా వాదులు చెప్పే సంఖ్యలు తప్పని నిరూపించండి.
  పాపం సమైక్య వాదుల పరిస్తితి చైనా యుద్దానికి వస్తే నెహ్రూ పరిస్థితి లాగా తయారయింది. తుపాకులు ఎక్కడ ఉన్నాయి అని వెతుక్కోవలసి వచ్చింది. ఏదో వాగుతున్నారు వాగనివ్వండి రాష్ట్రం ఎక్కడికి విడి పోతుంది, అదీ ఎలచ్చన్లల్లో రెడ్డి గారు గెలిచారు కదా అని కెరీర్ పైనా, అభివృద్దిపైనా సంపూర్ణ దృష్టి పెట్టిన సమైక్య మేధావులు మేడం అర్థ రాత్రి దెబ్బతో బిత్తరపోయి మేల్కొన్నారు. మీరు అడిగిన లెక్కలు ఇహ వస్తునే ఉంటాయి, వెయిట్ అండ్ సీ.
  –నాబార్డ్ రుణాల్లో తెలంగాణకు 130లో కేవలం పదికోట్లే
  తుమ్మినా దగ్గినా పెన్సిలినేనా, ఏ జిల్లా కలక్టరో రిపోర్ట్ పంపక నిద్ర పొయ్యి ఉంటాడు, లేకపోతే విభజన కారులను అదుపు చెయ్యటంలో బిజీగా ఉండి ఉంటాడు. ఇప్పుడు చేసే పోరాటాల్లో 1 శాతం చేసినా వందేం కర్మ లచ్చ కోట్లు వచ్చేయి. విదర్బకు 10 వేల కోట్లు వచ్చాయి అని మనవి.
  — అంతే కాని హైదరబాదులో ఎడాపెడా ఇన్వెస్టు చేసిన రాజకీయనాయకులు ఏదో స్వార్థంతో మాట్లాడుతుంటే వాళ్ళ బుట్టలో పడకండి
  బాధంతా తెలబాన్ రాజకీయ నాయకుల రగిల్చే అగ్గిలో మిడతల్లా తెలంగాణా వారు వెళ్తున్నారనే.

  –తెలంగాణ వస్తే అభ్యంతరం చెప్పాల్సింది కేవలం సీమ ప్రజలు
  ఆత్మ గౌరవం ఉన్న ప్రతి తెలుగు వాడు, ప్రతి తెలంగాణా వాడు. ఏమిటి ఈ విభజన, ఏ ప్రాతిపదిక పై, వెయ్యి మంది రౌడీలు రోడ్డపై తిరిగి రాళ్లేసినందుకా, దొంగ దీక్షలకా, తెలుగు వాడి బలాన్ని ముక్కలు చెయ్యటానికా, జనాలు పొయిన సారి ఎలచ్చన్లలోనే తీర్పు చెప్పారు మాకు అభివృద్ది కావాలి, రెడ్డి గారు లాంటి ముఖ్య మంత్రి కావాలని. సంవత్సరంలోనే ఈ రచ్చ రచ్చ రసాభస ఏమిటి – ఆలోచిస్తే చాలు జవాబులు అవే వస్తాయి.

  — కబ్జా చేసే అధికారం kcr కాదు గదా వాడి బాబుగ్గూడా లేదు
  మీరు భాగ్య నగరంలో ఎటువంటి ప్లాట్లూ ఎవరూ కబ్జా చెయ్యలేదు అని గాని అంటల్లేదు కదా. అన్నట్టు పాకిస్తాన్ జిన్నా కూడా సెక్యులరిస్టే.
  — భయపడకండా కాస్త వివేకంతో ఆలోచించండి
  భయ పడి కాదు, వివేకంతోనే ఆందోళన చెందుతున్నాం. మాకు తెలుగు నాడంటే అనంత అవకాశాలు, ముక్కలు చేసి ఎందుకు లేని పోని కొర్రీలు. మేము నమ్ముతాం కలిసి ఉన్న రాష్ట్రంలోనే తెలంగాణాకు ధీర్ఘకాలికి ప్రయోజనాలు అనంతమని, అందుకే ఈ ఆందోళన.

  — చిన్న రాష్ట్రాల వల్ల ఎక్కువ నగరాలు, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి
  చిన్న రాష్ట్రాలు లేకుండా కూడా నగరాలు సృజించుకోవచ్చు. జబ్బు ఒకటయితే మందు మరొకటి ఇస్తున్నారు. ఉద్యోగాల కోసం రాష్టాలు కాదు నాయనా, అంద కంటే ప్రొడక్టివిటీ ఉద్యోగాలు చాలా సృజించవచ్చు, దేశాన్ని ముందుకు నడిపించుకోవచ్చు. కాసిన నెయ్యంతా తగలబెట్టినా అయిపోతుంది, అమ్ముకున్నా అయిపోతుంది. ఏది లాభం.

  — సామాన్యులకేమీ నష్టం లేదు
  సామాన్యునికే చాలా నష్టం. ఈ విషయం పై తరువాత ఒక టపా వ్రాయగలను.

  — మరో విషయం. రాష్ట్ర విభజన అంటే రాత్రికి రాత్రే గీత గీసి తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి వ్యవహారం కాదు
  ఇప్పుడు అలాగే జరిగింది. భాగ్యనగరం ఒక్కసారిగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి పోయింది. ఆటిట్యూడ్ విషటంలో. మళ్లా చాలా కష్టపడాలి ఆ ఇమేజ్ తెచ్చుకోవటానికి, ఇహ అసాధ్యం కూడా అనుకుంటాను. ఈ లోపులో కోట్ల రూపాయల ప్రాజెక్టులు చెన్నై కి తరళి వెళ్లాయి. చిదంబరానికి కావలసింది అదే అనుకుంటాను. ఈ రాజకీయ నాయకులు విభజించినా కలిపి ఉన్నా సృజించే ఉద్యోగాలు గుండు సున్నా, తెలంగాణా విధ్యార్థులు చెయ్యాలసింది ఆ పని రోడ్డెక్కి రాళ్లేసి కొట్టడం కాదు. ప్రతి తెలంగాణా పట్టణంలో కూడా తమ సృజనాత్మకత ఉపయెగించి వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించాలి. అదొక్కటే సొల్యుషన్. వ్యాపార సామ్రాజ్యాలు అంటే రాత్రికి రాత్రే అంబానీలు కావటం కాదు. ఎలక్ట్రిక్ కుక్కర్ తయారీతోనో, మౌస్ల్ తయారీతోనో ప్రారంభించవచ్చు. ఆటిట్యూడ్ మారాలి. మేధావులు చెయ్యలసింది అది , అంతే కాని ఎప్పుడో కాకి రెట్ట వేసింది అని కాకులపై పగ పట్టి రాజుతో కాకలను చంపటంలా ప్రవర్తించే వారు మేధావులు కాదు.

  — రాష్ట్రం విడిపోతుందా
  రాష్ట్రం ఇప్పటికే మానసికంగా విడిపోయింది. తెలబాన్లకు దండాలు.

  ఇలా చాలా వ్రాయచ్చు కాని, టైం బొక్క అని ఆ ఒక్క సమాధానంతో మీరే ఆలోచించుకోవచ్చు అని వదిలేశాను.

  ఇది ఒక అప్రజాస్వామ్యిక, అసమంజస, విభజన. తెలుగు తరాలకు కోలుకోలేని దెబ్బ.

  చేతులు కాలాయి. నేను ఇహ ఈ విషయం పై రిటైర్.

  ప్రజాస్వామ్యం. ప్రజలే అల్టిమేట్. వారు కసాయిని నమ్ముతారో, కబోదిని నమ్ముతారో, కాంతిని నమ్ముతారో వారిష్టం.

  మీ సమయానికి నెనర్లు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s