“చేయెత్తి జైకొట్టు తెలుగోడా!”

సచీదేవి గారి వ్యాఖ్యలో “వెలికి తీద్దాం ఓకనాటి ప్రాభవం; తెలుగువారమని గర్వంగా చాటుదాం” అన్నవాక్యం స్పుర్తితో, నాటి పరిస్థితులకి, నేటి సమకాలీన రాజకీయలకి దర్పణం పట్టిన ‘వేములపల్లి శ్రీకృష్ణ’ గారి రచన 

“చేయెత్తి జైకొట్టు తెలుగోడా!” ఇక్కడుంచుతున్నాను. ముఖ్యంగా చివరి రెండు పద్యాలు గమనించండి,  ప్రస్థుతం ప్రభలుతున్న ప్రాంతీయవాదనికి అచ్చుగుద్దినట్లు సరిపొతున్నాయి.

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

గతమెంతో ఘనకీర్తి గలవోడా!

సాటిలేని జాతి – ఓట మెరుగని కోట

నివురుగప్పి నేడు – నిదురపోతుండాది

జైకొట్టి మెల్కోలుపు తెలుగోడా!

గతమెంతో ఘనకీర్తి గలవోడా!               || చేయెత్తి || 

వీర రక్తపుధార – వారబోసిన సీమ

పలనాడు నీదెరా – వెలనాడు నీదెరా

బాలచంద్రుడు చూడ ఎవడోయి!

తాండ్ర పాపయ్య గూడ నీవొడూ!            || చేయెత్తి || 

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల

మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే

వీరవనెతలగన్న తల్లేరా!

ధీరమాతల జన్మభూమేరా!                   || చేయెత్తి || 

నాగర్జునుడికొండ, అమరావతీ స్థూపం

భావాల పుట్టాలో – జీవకళ పొదిగావు

అల్పుడను కావంచు తెల్పావు నీవు!

శిల్పినని చాటావు దేశదేశాలలో!             || చేయెత్తి || 

దేశమంటే మట్టి కాదన్నాడు

మునుషులన్న మాట మరువబోకన్నాడు

అమర కవి గురజాడ నీవాడురా!

ప్రజల కవితను చాటి చూపాడురా!           || చేయెత్తి || 

రాయలేలిన సీమ – రతనాల సీమరా

దాయగట్టె పరులు – దారి తీస్తుండారు

నోరెత్తి యడగరా దానోడా!

వారసుడ నీవెరా తెలుగోడా!                    || చేయెత్తి || 

కల్లోల గౌతమీ – వెల్లువల కృష్ణమ్మ

తుంగభద్రా తల్లి – పోంగిపొరలిన చాలు

ధాన్యరాసులే పండు దేశానా!

కూడు గుడ్డకు కొదవలేదన్నా!                 || చేయెత్తి || 

ముక్కోటి బలగమోయ్ – ఒక్కటై మనముంటే

ఇరుగు పొరుగులోన – వూరు పేరుంటాది

తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!

సవతి బిడ్డల పోరు మనకేలా!                  || చేయెత్తి || 

పెనుగాలి వీచింది – అణగారి పోయింది

నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది

చుక్కాని బట్టారా తెలుగోడా!

నావ దరిజేర్చరా – మొనగాడా!               || చేయెత్తి || 

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

  1. ramakrishna
    ఫిబ్ర 25, 2008 @ 01:17:37

    “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా…గతమెంతో ఘనకీర్తి గలవోడా…” ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పాట/పద్యం మళ్ళీ గుర్తుచేశారు, నెనర్లు.

  2. వల్లూరి
    ఫిబ్ర 25, 2008 @ 22:19:10

    ధన్యవాదములు రామకృష్ణ గారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s