ఓ సలహా!

ఉదయం లేచినప్పటినుండి తిరిగి నిద్రకుపకరించే వరకు ప్రతివక్కరము ఏదో ఒక రకమైన ఒత్తడిని ఎదుర్కొంటునేవుంటాం.  ఆఫీసులో పని ఒత్తడి, ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఆర్ధకపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు, ఇలా ఎన్నో ఒత్తడిలు ఎదుర్కొనేవారికి చివరికి ఇంటిలో కూడా మనఃశ్సాంతి కరువైతే అంతకన్నా దుర్భర జీవితం మరొకటి వుండదు. అందుకే బయట ఎదుర్కొంటున్న సమస్యలను ఇంటికి మోసుకురాకూడదు.   కాని అది పాటించేవారు తక్కువ.  ఆఫీసులో ఏర్పడిన ఘర్షణ, కోపాలను ఇంటి దగ్గర భార్య మీద ప్రదర్శిస్తారు కొందరు.  మరికొంతమంది తమలో తాము కోపతపాలను అనుచుకొని, బాధను దిగమింగుతు మదనపడిపోతుంటారు. ఇవి రెండూ   కుటుంబవాతావరణాన్ని పాడుచేసేవే. కనుక ఆఫీసు విషయాలను అక్కడే వదిలివేసి, ‘ఇంటి’ విషయాలు, ‘ఇంతి’ విషయాలు వంటబట్టించుకొంటే, సంసార సమతుల్యత కాపాడినవారవుతారు. ఏమంటారు?

వ్యాఖ్యానించండి