పొలీసు భార్య రాత్రి నిద్రలోంచి లేచి భర్తను లేపింది: “ఏమండోయ్ లేవండి, దొంగ వచ్చాడు పట్టుకోండి” 

పొలీసు భర్త: ” అబ్బా! విసిగించక పడుకోవే బాబు ! డ్యూటిలో లేనప్పుడు కూడా పనేమిటి?”

_____________________________________________________________________ 

పట్నం మకాంమార్చిన పరంధామయ్య భర్యతో: “నేను ఎప్పుడు దుబారా ఖర్చు పెడతానని  నా మీద ఊరికే అరుస్తావు కాని, నేనెప్పుడైనా అనవసరంగా ఒక్క వస్తువైనా కోన్నానా?” 

ఆ అమాయకపు ఇల్లాలు: “చాల్లేండి. ఆ నిప్పులార్పే సిలిండరు కొని చాలకాలమైంది. ఒక్క సారైనా వాడిన పాపానపొయ్యారా? అది దుబారా కాకా మరేంటి?” _______________________________________________________________________ 

చదువురాని నౌకరు యజమాని దగ్గరకు ఉత్తరం తెచ్చి “మావూరి నుంచి మా ఆడది ఈ ఉత్తరముక్క రాయించింది బాబు, కాసంత సదివి పెడతరా?” అని అడిగాడు. సరేనని, యజమాని ఉత్తరం అందుకొని చదవటం మొదలుపెట్టాడు.  అంతలో,  నౌకరు వెనుకనుంచి వచ్చి అతని చెవులు మూసివెయటంతో తెల్లబోయి విషయమేమిటని అడిగాడు. దానికా నౌకరు “మొగుడుపెళ్ళాల విషయంకదా బాబయ్య, పరాయోళ్ళు వింటే బావోదని” సంజయిషి ఇచ్చుకున్నాడు.

____________________________________________________________________

నేను పెళ్ళి చేసుకుంటే ఎంతమంది అబ్బాయిలు బాధాపదతారో తెలుసా?” అంది తానెంతో అందగత్తేనని ఫిలయ్యే సౌందర్య.  మరి అంతమందిని చేసుకోవటానికి మీ అమ్మానాన్నాలు ఒప్పుకుంటారా?” చప్పున అడిగింది ఐశ్వర్య.

_______________________________________________________________________ 

 సార్ ! మేనెజర్ గారు మిమ్మలని రమ్మ న్నారు”  చెప్పాడు అటేండర్, మందుబాబు మాణిక్యంతో.  ఆ! అంతమాటన్నరా? నేను ఆయన్ని బ్రాంది అన్నానని చెప్పు పో  అన్నాడు మాణిక్యం మత్తులో జోగుతు.   _____________________________________________________________________  

చాలసేపటి తరువాత వచ్చిన సిటిబస్ లొనికి తొసుకుంటు వెళ్ళి, వెంబటే తిరిగి దిగిన ఆసామిని చూచి విషయమేమిటని ఆశ్చ్యర్యంతో అడిగాడు దారినపోయె దానయ్య. దానికి ఆ ఆసామి  “మొన్న ఒకరోజున టికెట్ లేకుండా బస్సేక్కానని కండక్టర్ మధ్యలోనే నన్ను బస్ దింపేశాడు. నేను ఉరుకోలేదు, ఈ రోజు వాడికి తగిన శాస్తి చేశాను” అన్నాడు.  ఎమిచేశారు అన్నాడు దానయ్య. ఎంచేశానా ! ఈ రోజు టికెట్ కొని కుడా బస్ ఎక్కలేదు” చేప్పాడు ఆసామి

______________________________________________________________________________

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s