మునిమానిక్యం నరసిం హారావు – చెణకులు

తెలుగు సాహిత్యంలో, కాంతం కథలతో అయస్కాంతంలా ఆకర్షించిన మునిమానిక్యం నరసిం హారావు గారు   విసిరిన కొన్ని చెణకులు:

పొగడ్త:   తినేవాడికితప్ప ఇతరులకు అసహ్యం కలిగించే వృత్తాంతం.  

——————————————————————————————-

పట్టుదల : మనలో ఉంటే సుగుణం. అదే ఇతరులలొ ఉంటే దానిని మొండి పట్టు అంటాము. తలబిరుసుతనం అని కూడా అనవచ్చు.

——————————————————————————————————– 

బుద్దిహీనుడు: పెద్ద బుద్దిహీనుల చేత గుణవంతుడని   పిలువబడేవాడు.

——————————————————————————————————–

ఆశ : అన్నీ నాశనమైన పోయిన తరువాత చివరకు మిదిలేది.

—————————————————————————————————– 

యౌవనము: ఆడపిల్ల వంక ఆశగా చూచే వయస్సు. 

—————————————————————————————————–

బేరము: అమ్మేవాడు కొనేవాడూ ఒకరినొకరు మొసగించుకోవడానికి చేసే ప్రయత్నము.

——————————————————————————————————– 

క్లాసిక్:  ఒక రకం పుస్తకం.  దాన్ని ఎవరూ చదవరు. కాని చదివినట్లు మాట్లాడుతారు.

  ——————————————————————————————————– 

ప్రకటన : నీవు బాగా ఎరిగున్న వస్తువునే, నీవు ఎప్పుడూ చుడనట్టిదిగాను దానిని గురించి విననట్టిదిగానూ భావింపజేసే వర్ణన.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

మునిమానిక్యం నరసిం హారావు – గిలిగింతలు

తెలుగు సాహిత్యంలో, కాంతం కథలతో అయస్కాంతంలా ఆకర్షించిన మునిమానిక్యం నరసిం హారావు గారు   విసిరిన కొన్ని చెణకులు, మరికొన్ని గిలిగింతలు:

__________________________________________________________________

పురపాలక సంఘ సభ్యులలో సగం మంది బుద్దిహీనులు అని ఒక పెద్దమనిషి అనే సరికి పెద్ద గొడవ బయలుదేరింది. ఆ మాట ఉపసం హరించుకోవలెనని సభ్యులు పట్టుబట్టారు. దానికి ఆ పెద్ద మనిషి విచారాన్ని నటిస్తూ మళ్ళీ ఇట్లా అన్నాడు.  

సరే ! ఉపసం హరించుకొంటాను. పురపాలక సంఘ సభ్యులలో సగం మంది బుద్దిహీనులుకారు” అని పై వాక్యాన్ని దిద్దుకొన్నాడు. _______________________________________________________________________ 

ఒకడు డాక్టరు తో  “నిద్ర లేచిన తర్వాత ఒక అరకంట సేపు తల తిరుగుతున్నట్లు వుంటుంది. డబ్బు పెట్టి మందు పుచ్చుకొనే శక్తి లేదు. ఏదైనా ఉపాయం చెప్పండి.”

డాక్టరు: “ఆ అరగంట అయిన తర్వాత నిద్ర లేవయ్యా”  _______________________________________________________________________ 

కుమార్తే  ఏడుస్తూ తల్లి దగ్గర కొచ్చింది.

ఏం తల్లి! ఎందుకూ ఏడుస్తున్నావూ?”

నా భర్త నాస్తికుడమ్మా. ఆ సంగతి తెలియక నన్ను ఇచ్చి పెండ్లి చేశారు మీరు.”

ఏమంటాడు విపులంగా చెప్పు?”

పాపం చేసినవాళ్ళు నరకానికి పోతారూ”  అన్నాను. దానికి ఆయన ” నరకం వుందని నాకు నమ్మకం లేదు”అన్నారు.

ఓస్! ఇంతేకదా! మనం ఇద్దరం కలిశేమా అంటే నిమిషం లొకి నరకం వుందని ఆయనకు నమ్మకం కలుగజేయవచ్చు. అదెంత పని!” అంది తల్లి.  ________________________________________________________________________ 

నీ భర్త పుస్తకాల పురుగా ఏమిటమ్మా?”

అబ్బే! అదేం కాదు.  మాములు పురుగే.” __________________________________________________________________________ 

హిప్నోటిజం,  అంటే యేమిటి అక్కా?” అడిగింది చెల్లి. 

 మనిషిని ప్రభావితం చేసి, నీవు యేది చెపితే అది చేసేటట్లు చేయడం” అన్నది అక్క

” అదా! అది హిప్నోటిజం కాదు. అది వివాహం” ఠక్కునంది చెల్లి. __________________________________________________________________ 

ఓ డాక్టారు భార్యా సమేతుడై పారులో విహరిస్తూ వుండ్గా ఒక చక్కని స్త్రీ  డాక్టారుగారికి నమస్కరించింది.

భార్య అడిగింది: “ఆవిడ్ మీది ఎట్లా తెలుసు?. ఎందుకు పరిచయం అయింది?”

డాక్టారు అన్నారు : “వృత్తిరీత్యా పరిచయం”

వెంటనే భార్య అడిగింది : ” మీ వృత్తా? ఆవిడ వృత్తా?”   _______________________________________________________________________

స్కూలుకు కొత్త రేదియొ వచ్చిన సంగతి ప్రధానోపాధ్యాయుడు సంతోషంగా చెబుతున్నాడు పెల్లలతో. 

  రేదియొ పాఠశాల నిధులలోనుంచి  కొన్నాము.

ప్రధాన సహయోపాధ్యాయుడు లౌడ్ స్పీకరును తన భార్య జ్ఞాపకార్ధము బహూకరించాడు. _____________________________________________________________________   

రోగి: “డాక్టరు గారూ కాళ్ళనొప్పులబాధ భరించలేకుండా ఉన్నానండీ.”

డాక్టరు: “మీరు ఆ విషయం ఆలోచిందకండీ. ఆ నొప్పులు నాకు వదిలేశెయ్యండి.”

రోగి:  “మీరు తీసుకొనేటట్లైతే నాకు సంతోషమే, కాని అవి నన్ను వదలటం లేదు.”

డాక్టరు: “నేను వదలిస్తాను. ఆ విషయం నాకు వదిలేశెయ్యండి”.

రోగి:   ఎంత బాధ అనుకొన్నారు డాక్టరు గారు! అనేక సార్లు విషం పుచ్చుకోని చనిపోదము అనిపిస్తూంది….” డాక్టరు: ఆ విషయం నాకు వదిలేశెయ్యమని చెప్పానా”” “.

____________________________________________________________________

1 వ్యాఖ్య (+add yours?)

  1. swathikumari
    ఫిబ్ర 20, 2007 @ 04:10:20

    baagunnaayi..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s