కీర్తి శేషులు ఘంటసాల గారి వర్ధంతి ఫిబ్రవరి 11న, ఆ సందర్భమున , ఆ మహనియుని తలుచుకోవటం ప్రతి తెలుగువాడి కనీస భాధ్యత. ఘంటసాల గారు 1974 ఫిబ్రవరి 11న దేవేంద్రుని సభ లో గానకాచేరి కోసమై భువిని విడిచి దీవికి వెళ్లారు. ఒకానొక సందర్భములో , ఘంటసాల గారి గురించి శ్రీ వేటూరి వారు ఇలా అన్నారు. “కర్ణాటక, హిందూస్తానీ సంగీతాలతో పాటు తెలుగు వారికి మరొక సంగీతం ఉంది, అదే ఘంటసాల వారి సంగీతము“. అంతటి అజరామారమైనది ఘంటసాల గారి గాన మాధుర్యం.
శ్రీ ఘంటసాల వారి సంబందించిన కొన్ని వివరాలు;
స్వస్తలం : టేకుపల్లి గ్రామం, కృష్ణా జిల్లా లోని దివిసీమ దగ్గర;
పుట్టిన తేదీ: 1922 డిసెంబెర్ 4 ;
పుట్టిన వూరు: చౌటుపల్లి గ్రామం, కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా
తల్లిదండ్రులు: రత్నమ్మ గారు, సూర్యనారాయణ గారు
గురువులు: ద్వారం వెంకట స్వామి నాయుడు గారు; ‘ హరికధ పితామహా‘ ఆదిభట్ల నారాయణ దాసు
కుటుంబం: భార్య : శ్రీమతి సావిత్రమ్మ
కుమారులు: విజయ్‌కుమార్; రత్నాకుమార్
కుమార్తెలు: శ్యామల; సుగుణ; శాంతి
అనుంగు సహచరుడు: సంగీత రావు. ఇక ఘంటసాల వారి సంగీతము, గాన మాధుర్యం ఎంత చెప్పిన తరగదు. భగవత్ గీత, దేశభక్తి గీతాలు, పద్యాలు, సినీగీతాలు, జానపద గీతాలు లలిత గీతాలు మొదలైనవి ఎన్నో ఘంటసాల గారి తో గళ సాంగత్యం చేసాయి. సినిమాలో అభినయించే కధానాయకుడికి తగినట్టు గాత్రాన్ని, స్వరాన్ని మార్చే ప్రక్రియకు ఆయనే ఆద్యుడు. అంతటి గాత్ర తేజస్సు ఘంటసాలది.
శ్రద్డాంజలి
11 ఫిబ్ర 2007 వ్యాఖ్యానించండి
ప్రకటనలు
ఇటీవలి వ్యాఖ్యలు