దీపిక

sincere, enthusiastic, simple…

మొక్కుబడి నివాళులు ఏప్రియల్ 1, 2007

ప్రచురించిన వర్గము Uncategorized — Valluri Sudhakar @ 4:05 అపరాహ్నం

పత్రికలో ప్రచురించిన, ఎస్.ఎం.సుభాని గారి కవిత లొని ఈకింది extracts మన ముందు తరాలవారిపైన, మారిన మనధోరణికి, మొక్కుబడి నివాళులకి దర్పణంపడుతున్నాయి. అవలోకించండి.   

గాంధి, నెహ్రూ, శాస్త్రి, భగత్‌సింగ్….

పుట్టినరోజు ఎవరిగైనా,

ఆ ఒక్కరోజు సందడే సందడి

దేశమంతా ఒకటే హడావుడి.

మరుగున పడిన విగ్రహాలకు

మార్పులు-చేర్పులు,రంగులు వేసి

మరీ మరమ్మత్తులు.

ఖద్దరు పంచెకట్టి, నెత్తిన టోపి పెట్టిన

నాయకుల నటనలకు జతబడి,అధికారుల అలజడి.

ఎటుచుసినా సభలు-సమావేశాలు,చిందులతో విందులు.

మురిపించే మువ్వన్నెల తోరణాలు

జండా వందనాలు, జతీయ గీతాలాపనలు.

భక్తితో..శ్రద్దాంజలులు, సర్వమత ప్రార్ధనలు. 

మరుసటి రోజు నుండిఎవరి పంథా వారిదే, ఎవరి దందా వారిదే.

 

Leave a Reply